దావీదు కుమారునికి జయం
ABN , Publish Date - Mar 30 , 2026 | 12:28 AM
యేసు మార్గం అనుసరణీయమని పాస్టర్లు అన్నారు. ఆదివారం పెద్దబోదనం, మద్దూరు, ముత్యాలపాడు, తోడెండ్లపల్లె, పెద్దవంగలి గ్రామాల చర్చిలలో గుడ్‌ఫ్రైడే పండుగకు ముందుగా వచ్చే మట్టల ఆదివారం పండుగను క్రైస్తవులు నిర్వహించారు. ఆర్సీఎం పాస్టర్ ఫెర్నాండెస్, సీఎ్‌సఐ పాస్టర్లు సౌందర్యరాజు, రవింద్రనాథ్, కిషోర్, విద్యాకర్, మార్తోమా ఏలియన్, నందం ఐజాక్, ఆనంద్‌కుమార్‌ల ఆధ్వర్యంలో మట్టలతో గుడి ప్రదక్షిణలు చేశారు.
మండలాల్లో ఘనంగా మట్టల ఆదివారం
చాగలమర్రి, మార్చి 29 (ఆంధ్రజ్యోతి): యేసు మార్గం అనుసరణీయమని పాస్టర్లు అన్నారు. ఆదివారం పెద్దబోదనం, మద్దూరు, ముత్యాలపాడు, తోడెండ్లపల్లె, పెద్దవంగలి గ్రామాల చర్చిలలో గుడ్‌ఫ్రైడే పండుగకు ముందుగా వచ్చే మట్టల ఆదివారం పండుగను క్రైస్తవులు నిర్వహించారు. ఆర్సీఎం పాస్టర్ ఫెర్నాండెస్, సీఎ్‌సఐ పాస్టర్లు సౌందర్యరాజు, రవింద్రనాథ్, కిషోర్, విద్యాకర్, మార్తోమా ఏలియన్, నందం ఐజాక్, ఆనంద్‌కుమార్‌ల ఆధ్వర్యంలో మట్టలతో గుడి ప్రదక్షిణలు చేశారు.
కొలిమిగుండ్ల: సీఎ్‌సఐ పాస్టర్ శ్రీదేవి, హోసన్నా మందిరం ఫాస్టర్ జేమ్స్, ఆయా గ్రామాలలోని చర్చి పాస్టర్ల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. యేసుక్రీస్తు యెరూషలేములోకి విజయవంతంగా ప్రవేశించిన ప్రాముఖ్యతను చర్చి ఫాస్టర్లు భక్తులకు వివరించారు.
కోవెలకుంట్ల: పట్టణంలోని సిఎ్‌సఐ చర్చి క్రైస్తవులు ఆదివారం మట్టల ఆదివారం పండుగను ఘనంగా నిర్వహించారు. పాస్టర్ ఐజాక్ బాబు, ఫాస్టరమ్మ సుధారాణి, సెక్రటరీ రత్నమయ్య ఆఽధ్వర్యంలో ఎల్‌ఎం కాంపౌండ్‌లో ర్యాలీ నిర్వహించారు.
ఉయ్యాలవాడ: మండల కేంద్రంలో పాస్టర్ జ్యోషి ప్రత్యేక ప్రార్థనలు చేసి, క్రైస్తవులతో =కలిసి ఈత మట్టలు పట్టుకొని చర్చీల చుట్టూ ప్రదిక్షణలు చేసి ప్రార్థనలో పాల్గొన్నారు.