నీటిముంపు బాధితులు మృతి
ABN , Publish Date - Nov 28 , 2026 | 11:55 PM
మండల పరిధిలోని సంకిరేణిపల్లె గ్రామానికి చెందిన నీటి ముంపు నిర్వాసితులు రమణయ్య, ఖాజామెయిద్దీన్ మృతి చెందారు.
ఫసంకిరేణిపల్లెలో ఇద్దరు మృతి
పగిడ్యాల, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి): మండల పరిధిలోని సంకిరేణిపల్లె గ్రామానికి చెందిన నీటి ముంపు నిర్వాసితులు రమణయ్య, ఖాజామెయిద్దీన్ మృతి చెందారు. మృతుల కుటుంబాలను శ్రీశైలం ముంపు నిర్వాహితుల సంఘర్షణ సమితి అధ్యక్షుడు జయన్న శనివారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మృతులు 98 జీవో కింద ఉద్యోగం కోసం దరఖాస్తులు చేసుకొని ఉద్యోగాల కోసం ఆందోళనల్లో పాల్గొనేవారన్నారు. నీటిముంపు నిర్వాసితులకు జీవో 98ప్రకారం ఉద్యోగాలు కల్పించడంలో పాలకులు జాప్యం చేయడంతో కుటుంబ పోషణ భారమై ముంపు బాధితులు మనోవేదనతో మృతి చెందారని అన్నారు. సంకిరేణిపల్లె గ్రామంలో ఒకరోజు వ్యవధిలో ఇద్దరు మృత్యువాతపడటం విషాదమన్నారు. నీటిముంపు బాదిధితులు శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణంలో సర్వసం కోల్పోయిన వారికి ఉద్యోగ ఆవకాశాలు కల్పించడంతో పాలకులు నిర్లక్ష్యం వహించడం తగదన్నారు. నీటిముంపు బాధితులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని నందికొట్కూరులో చేపట్టిన నిరహార దీక్షలు 248 రోజులకు చేరుకున్న పాలకులు మాత్రం స్పందించలేదని ఆయన ఆరోపించారు.