Share News

నైతిక విలువలు నేర్పే వేమన పద్యాలు

ABN , Publish Date - Jan 20 , 2026 | 12:07 AM

యోగి వేమన రచించిన పద్యాలు సమాజానికి నైతిక బోధనను అందించాయని, చిన్నతనం నుంచే వాటిని అధ్యయనం చేయడం ద్వారా వ్యక్తిత్వ వికాసం సాధ్యమౌతుందని కలెక్టర్‌ రాజకుమారి అన్నారు.

నైతిక విలువలు నేర్పే వేమన పద్యాలు
వేమన చిత్రపటానికి నివాళులర్పించిన కలెక్టర్‌, జేసీ

కలెక్టర్‌ రాజకుమారి

నంద్యాల నూనెపల్లి, జనవరి 19 (ఆంధ్రజ్యోతి) : యోగి వేమన రచించిన పద్యాలు సమాజానికి నైతిక బోధనను అందించాయని, చిన్నతనం నుంచే వాటిని అధ్యయనం చేయడం ద్వారా వ్యక్తిత్వ వికాసం సాధ్యమౌతుందని కలెక్టర్‌ రాజకుమారి అన్నారు. సోమవారం నంద్యాల కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్‌ హాలులో యోగి వేమన జయంతి కార్యక్రమంలో కలెక్టర్‌ ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. యోగి వేమన పద్యాలు సామాజిక సమానత్వం, మానవతా విలువలు, నిజాయితీ, కష్టపడి జీవించడం వంటి అంశాలను బలంగా ప్రతిపాదిస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ కార్తీక్‌, డీఆర్వో రామునాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

మానవతావాది వేమన

జిల్లా అడిషనల్‌ ఎస్పీ యుగంధర్‌ బాబు

నంద్యాల క్రైం, జనవరి 19 (ఆంధ్రజ్యోతి): తన పద్యాలతో మూఢ నమ్మకాలను ఖండించి, మానవతావాదాన్ని చాటిచెప్పిన గొప్ప వ్యక్తి యోగి వేమన అని జిల్లా అడిషనల్‌ ఎస్పీ (అడ్మిన్‌) ఎన్‌. యుగంధర్‌బాబు పేర్కొన్నారు. సరళమైన భాషలో జీవిత సత్యాలను బోధించిన గొప్ప దార్శకుడిగా, సామాజిక మార్గదర్శిగా వేమనను కొనియాడారు. సోమవారం ప్రజాకవి, సాంఘిక సంస్కర్త యోగి వేమన జయంతిని స్థానిక ఎస్పీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏఆర్‌ డీఎస్పీ శ్రీనివాసులు, రిజర్వ్‌ ఇన్‌స్పెక్టర్‌ మంజునాథ్‌, ఆర్‌ఎస్‌ఐ హర్షవర్ధన్‌రెడ్డి పాలొన్నారు.

Updated Date - Jan 20 , 2026 | 12:07 AM