Share News

కూర'గాయాలు'

ABN , Publish Date - Jun 18 , 2026 | 12:23 AM

కూరగాయల ధరలు భగ్గుమంటున్నాయి. సామాన్యులు కొనలేనంతగా పెరిగాయి.

కూర'గాయాలు'
చాగలమర్రిలో వినియోగదారులు లేక వెలవెలబోతున్న సంతమార్కెట్‌

టమోటా కిలో రూ.50, క్యారెట్‌ రూ.100, అల్లం రూ.200, బీరకాయలు రూ.60..

కొనేందుకు బెంబేలెత్తుతున్న వినియోగదారులు

చాగలమర్రి, జూన్‌ 17 (ఆంధ్రజ్యోతి): కూరగాయల ధరలు భగ్గుమంటున్నాయి. సామాన్యులు కొనలేనంతగా పెరిగాయి. అల్లం ధర కేజీ రూ.200 పలుకుతోంది. కొద్ది రోజుల కింద టమోటా కేజీ రూ.10లోపే ఉండేవి. ఇప్పుడు రూ.50 పలుకుతోంది. చాగలమర్రి సంతమార్కెట్‌లో బుధవారం కిలో క్యాకెట్‌, చిక్కుడు కాయలు, బీన్స్‌, కాకరకాయలు రూ.100 పైనే పలికాయి. అలాగే మట్టికాయలు రూ.60, వంకాయలు రూ.60, మిర్చి రూ.50, ఆలు రూ.40, మునగకాయలు రూ.80, బీరకాయలు రూ.60 పలకడంతో వినియోగదారులు బెంబేలెత్తుతున్నారు. టమోటా సాగు తగ్గిపోవడంతో మదనపల్లె నుంచి కొనుగోలు చేసి మార్కెట్‌లో విక్రయిస్తున్నట్లు వ్యాపారులు చెబుతున్నారు. టమోటా దిగుబడి లేకపోవడంతో ధర మండుతోంది. ఈ ధరలకు సామాన్య ప్రజలు కొనలేని పరిస్థితి ఉంది. ఉద్యాన అధికారులు ధరలు తగ్గేలా చర్యలు తీసుకోవాలని వినియోగదారులు కోరుతున్నారు.

Updated Date - Jun 18 , 2026 | 12:23 AM