ఎంబీబీఎస్ పరీక్షలను తనిఖీ చేసిన వీసీ
ABN , Publish Date - Apr 04 , 2026 | 11:23 PM
కర్నూలు మెడికల్ కాలేజీలో జరుగుతున్న ఎంబీబీఎస్ ఫైనలియర్ పరీక్షలను ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ డా.పి.చంద్రశేఖర్ కేఎంసీ ప్రిన్సిపాల్ డా.కే.చిట్టినరసమ్మతో కలిసి శనివారం తనిఖీ చేశారు.
కర్నూలు హాస్పిటల్, ఏప్రిల్ 4 (ఆంధ్రజ్యోతి): కర్నూలు మెడికల్ కాలేజీలో జరుగుతున్న ఎంబీబీఎస్ ఫైనలియర్ పరీక్షలను ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ డా.పి.చంద్రశేఖర్ కేఎంసీ ప్రిన్సిపాల్ డా.కే.చిట్టినరసమ్మతో కలిసి శనివారం తనిఖీ చేశారు. పరీక్షల నిర్వహణ సంతృప్తికరంగా ఉందని, మరింత పకడ్బందీగా నిర్వహించేందుకు ప్రిన్సి పాల్‌కు ఆయన పలు సూచనలు చేశారు. పరీక్షలో విద్యార్థులు మాల్ ప్రాక్టీసుకు పాల్పడితే రెండేళ్లు డిబార్ చేస్తామని హెచ్చరించారు. వీసీ వెంట వైస్ ప్రిన్సిపాల్ డా.సింధియా శుభప్రద, యూనివర్సిటీ స్పెషల్ అబ్జర్వర్ ఫోరెన్సిక్ ప్రొఫెసర్ డా.వైకేసీ రంగయ్య, ఎగ్జామ్స్ చీఫ్ సూపరింటెండెంట్ డా.రాజేష్ పాల్గొన్నారు.