వీబీ జీరామ్‌జీని సమర్థవంతంగా అమలు చేయాలి
ABN , Publish Date - Aug 04 , 2026 | 11:31 PM
వీబీ జీరామ్‌జీ కార్యక్రమాన్ని జిల్లాలో సమర్థవంతంగా అమలు చే సి లక్ష్యాలను పూర్తి చేయాలని కలెక్టర్ రాజకుమారి అధికారులను ఆదేశించారు.
కలెక్టర్ రాజకుమారి
నంద్యాల నూనెపల్లి, ఆగస్టు 4 (ఆంధ్రజ్యోతి): వీబీ జీరామ్‌జీ కార్యక్రమాన్ని జిల్లాలో సమర్థవంతంగా అమలు చే సి లక్ష్యాలను పూర్తి చేయాలని కలెక్టర్ రాజకుమారి అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి పథకం అమలుపై ఎంపీడీవోలు, డ్వామా శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. గ్రామీణ అభివృద్ధి జీవనోపాధి మెరుగుదల, పర్యావరణ పరిరక్షణ కేంద్ర ప్రభుత్వం చేపట్టిన హరితాభివృద్ధి లక్ష్యాలను సాధించేందుకు అధికారులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. గ్రామీణ ప్రాంతాల్లో స్థానిక వాతావరణానికి అనుకూలమైన మొక్కలను నాటాలన్నారు. ఉద్యాన తోటల పెంపకంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు.