ఘనంగా వాల్మీకి జయంతి
ABN , Publish Date - Oct 27 , 2026 | 12:24 AM
స్థానిక జిల్లా పోలీస్ కార్యాలయంలో వాల్మీకి మహర్షి జయంతిని పురస్కరించుకుని సోమవా రం ఏఆర్ అడిషినల్ ఎస్పీ కృష్ణ మోహన వాల్మీకి మహర్షి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు.
కర్నూలు క్రైం, అక్టోబరు 26(ఆంధ్రజ్యోతి): స్థానిక జిల్లా పోలీస్ కార్యాలయంలో వాల్మీకి మహర్షి జయంతిని పురస్కరించుకుని సోమవా రం ఏఆర్ అడిషినల్ ఎస్పీ కృష్ణ మోహన వాల్మీకి మహర్షి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్బంగా వాల్మీకి జీవి తాన్ని, ఆయన రచించిన రామాయణం ద్వారా సమాజానికి అందిం చిన ధర్మం, నీతి, సత్యం వంటి విలువలను స్మరించుకున్నారు. ఆర్‌ఐ నారాయ ణ, ఆర్‌ఎస్‌ఐలు, స్పెషల్ పార్టీ పోలీసులు, ఏఆర్ పోలీసులు పాల్గొన్నారు.
కర్నూలు ఎడ్యుకేషన: స్థానిక బీ.క్యాంపు ప్రభుత్వ ఒకేషనల్ జూని యర్ కళాశాలలో వాల్మీకి మహర్షి జయంతి సందర్భంగా ప్రిన్సిపాల్, ఎనఎస్‌ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ డా.ఎస్.నాగస్వామి నాయక్ వాల్మీకి చిత్రప టానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కళాశాల సిబ్బంది వాణి ప్రసన్న, మల్లికార్జున, విజయ శేఖర్, రామకృష్ణ, సుజాత పాల్గొన్నారు.
కర్నూలు అర్బన: విద్యా ర్థులు వాల్మీకి మహర్షిని ఆదర్శం గా తీసుకోవాలని ప్రిన్సిపాల్ ఎం. ఇందిరా శాంతి అన్నారు. సోమవారం ప్రభుత్వ బాలుర డిగ్రీ కళాశా లలో వాల్మీకి జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. వైఎస్ ప్రిన్సిపాల్ సత్యనారాయణ, అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు.
ఓర్వకల్లు: ప్రతి ఒక్కరూ మానవతా విలువలను పెంచుకోవాలని వాల్మీకులు అన్నారు. సోమవారం మండలంలోని నన్నూరు, హుశేనాపురం, కేతవరం, పూడిచెర్ల, లొద్దిపల్లె గ్రామాల్లో వాల్మీకి జయంతిని ఘనంగా నిర్వహించారు. వాల్మీకి మహర్షి చిత్రపటానికి పూలమాలలు వేసి ట్రాక్టర్‌పై ఏర్పాటు చేసి గ్రామ వీధుల్లో ర్యాలీ నిర్వహించారు. అనంతరం వాల్మీకి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
గూడూరు: గూడూరులో వాల్మీకి జయంతి వేడుకలను వాల్మీకులు ఘనంగా జరుపుకున్నారు. సోమవారం గూడూరులోని వాల్మీకి ఆలయం లో భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. పట్టణంలోని కొండిగేరి, సింగ నగేరి, మూలగేరి, కురుకుంద వీధి, బోయ వీధి, తూర్పు, పడమర బీసీ కాలనీల్లో వాల్మీకి జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళి అర్పించారు. ఈసందర్భంగా వాల్మీకి ఆలయాన్ని విద్యుత దీపాలతో ముస్తాబు చేశారు. కార్యక్రమంలో వాల్మీకీ సంఘం పెద్దలు, యువకులు పాల్గొన్నారు.