Share News

వైభవంగా వల్లెలాంబదేవి రథోత్సవం

ABN , Publish Date - Mar 20 , 2026 | 01:19 AM

పట్టణంలో ఉగాది పండుగ పురస్కరించుకుని వల్లెలాంబదేవి రథోత్సవం గురువారం వైభవంగా నిర్వహించారు.

వైభవంగా వల్లెలాంబదేవి రథోత్సవం
రథోత్సవానికి హాజరైన జనం

కోడుమూరు, మార్చి 19(ఆంధ్రజ్యోతి): పట్టణంలో ఉగాది పండుగ పురస్కరించుకుని వల్లెలాంబదేవి రథోత్సవం గురువారం వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకలను తిలకించేందుకు వేలాది మంది భక్తులు తరలివచ్చారు. ముందుగా వల్లెలాంబదేవి ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే రథాంగ హోమం నిర్వహించిన అనంతరం అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని రథంపై అధి ష్టించారు. అనంతరం భక్తులు రథాన్ని లాగుతుండగా వచ్చిన వేలాది మంది భక్తులు అమ్మా జగన్మాతా అంటూ నినాదాలు చేశారు. ఈసంద ర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సీఐ తబ్రేజ్‌ ఆధ్వర్యంలో ఎస్‌ఐ డివై స్వామి బందోబస్తు నిర్వహించారు. ఆలయ చైర్మన్‌ రఘునాథ్‌రెడ్డి, వైసీపీ నాయకుడు ఆది మూలపు సతీష్‌, గ్రామ పెద్ద ఎద్దుల మహేశ్వరరెడ్డి, ఆలయ సభ్యులు రమేష్‌నాయుడు, శ్రీనివాసులు, హనుమంతు పాల్గొన్నారు.

Updated Date - Mar 20 , 2026 | 01:19 AM