వ్యాక్సినేషన్ పరిశీలన
ABN , Publish Date - Mar 04 , 2026 | 11:06 PM
నగరంలోని శ్రీరామ్‌నగర్ అర్బన్ హెల్త్ సెంటర్‌లో అమలు అవుతున్న వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమాన్ని డిస్ట్రిక్ట్ ఇమ్యునైజేషన్ ఆఫీసర్ డాక్టర్ ఉమ తనిఖీ చేశారు.
కర్నూలు హాస్పిటల్, మార్చి 4 (ఆంధ్రజ్యోతి): నగరంలోని శ్రీరామ్‌నగర్ అర్బన్ హెల్త్ సెంటర్‌లో అమలు అవుతున్న వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమాన్ని డిస్ట్రిక్ట్ ఇమ్యునైజేషన్ ఆఫీసర్ డాక్టర్ ఉమ తనిఖీ చేశారు. గర్భిణులు, బాలింతలకు ముందుగానే టీకాల వివరాలను ఏఎన్‌ఎం, ఆశా కార్యకర్తలు సమాచారం ఇవ్వాలన్నారు. పాల ప్రాముఖ్యం, ఓఆర్‌ఎస్, జంక్ మాత్రలు, వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. అనంతరం డీఐవో ఎంసీపీ కార్డులను పరిశీలించారు. కార్యక్రమంలో హెచ్‌ఈఈవో బాబా ఫకృద్దీన్, హెల్త్ సూపర్‌వైజర్ శివకుమార్ పాల్గొన్నారు.