Share News

ఉపాధి పనులను వినియోగించుకోండి: ఎమ్మెల్యే దస్తగిరి

ABN , Publish Date - Apr 19 , 2026 | 12:12 AM

ఉపాధి హామీ పను లను వినియోగించుకోవాలని కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి అన్నారు.

ఉపాధి పనులను వినియోగించుకోండి: ఎమ్మెల్యే దస్తగిరి
ఉపాధి కూలీలతో కలిసి పనిచేస్తున్న ఎమ్మెల్యే దస్తగిరి

కర్నూలు రూరల్‌, ఏప్రిల్‌ 18(ఆంధ్రజ్యోతి): ఉపాధి హామీ పను లను వినియోగించుకోవాలని కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి అన్నారు. కర్నూలు మండలం గార్గేయపురం గ్రామంలో శనివారం ఉపాధి కూలీలతో కలిసి స్వర్ణాంధ్ర-స్వచ్చాంధ్ర కార్యక్రమంలో భాగంగా కోడుమూరు ఎమ్మెల్యే పాల్గొని కూలీలతో పాటు పూడికను తొలగిస్తూ, శ్రమదానం చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ నీటిని నిల్వ ఉంచడం, భవిష్యత్‌ తరాలకు గొప్ప వరమన్నారు. కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు సీతారామిరెడ్డి, మిలటరికాలనీ అభిలాష్‌ పాల్గొన్నారు.

Updated Date - Apr 19 , 2026 | 12:13 AM