Share News

బాలుడి వైద్యానికి యూటీఎఫ్‌ సాయం

ABN , Publish Date - Nov 12 , 2026 | 11:50 PM

మెదడు సంబంధ వ్యాధితో బాధపడుతున్న బాలుడి వైద్య ఖర్చులకు యూటీఎఫ్‌ నాయకులు రూ.52వేలు ఆర్థిక సాయం అదజేశారు.

బాలుడి వైద్యానికి యూటీఎఫ్‌ సాయం
బాలుడిని పరామర్శిస్తున్న యూటీఎఫ్‌ నాయకులు

ప్యాపిలి, నవంబరు 12(ఆంధ్రజ్యోతి): మెదడు సంబంధ వ్యాధితో బాధపడుతున్న బాలుడి వైద్య ఖర్చులకు యూటీఎఫ్‌ నాయకులు రూ.52వేలు ఆర్థిక సాయం అదజేశారు. మండలంలోని బావిపల్లి ఉన్నత పాఠశాల కాంట్రాక్టు వ్యాయామ ఉపాధ్యాయుడు ప్రవీణ్‌సింగ్‌ కుమారుడు లక్ష్మణసింగ్‌(3) మూడు నెలలుగా మెదడు సంబంధ వ్యాధితో బాధపుడుతున్నారు. శస్త్రచికిత్సకు రూ.2లక్షలు ఖర్చవుతుందని వైద్యులు తెలిపారు. సమాచారం తెలుసుకున్న యూటీఎఫ్‌ నాయకులు చందాలు వేసుకొని రూ.52వేలను కర్నూలులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలుడిని పరామర్శించి అనంతరం తండ్రి ప్రవీణ్‌ సింగ్‌కు అందజేశారు. నాయకులు సురే్‌షకుమార్‌, వెంకటేశ్వరనాయక్‌, లతీఫ్‌, సుధాకర్‌, రవికుమార్‌, నవీన్‌పాటి పాల్గొన్నారు.

Updated Date - Nov 12 , 2026 | 11:50 PM