Share News

తాగునీటి అవసరాలకే వినియోగించుకోవాలి

ABN , Publish Date - Sep 18 , 2026 | 12:18 AM

తాగునీటి అవసరాలను తీర్చేందుకే నీరు విడుదల చేసినట్ల ఎమ్మెల్యే అఖిలప్రియ తెలిపారు. గురువారం ఆర్‌.పాంపల్లె గ్రామ కుంటను పరిశీలించారు.

తాగునీటి అవసరాలకే వినియోగించుకోవాలి
ఉపాధ్యాయులు రామాంజినేయులు, నాగమణితో మాట్లాడుతున్న ఎమ్మెల్యే

ఉయ్యాలవాడ, సెప్టెంబరు 17(ఆంధ్రజ్యోతి): తాగునీటి అవసరాలను తీర్చేందుకే నీరు విడుదల చేసినట్ల ఎమ్మెల్యే అఖిలప్రియ తెలిపారు. గురువారం ఆర్‌.పాంపల్లె గ్రామ కుంటను పరిశీలించారు. నియోజకవర్గంలోని 65కుంటలు, చెరువులకు కేసీ కెనాల్‌, ఎస్సార్‌బీసీ, తెలుగుగంగ కాలువల ద్వారా నీటిని విడుదల చేసి నింపుతున్నామన్నారు. టీడీపీ కన్వీనర్‌ బోరెడ్డి శేఖర్‌రెడ్డి, మారంరెడ్డి వెంకటేశ్వరరెడ్డి, నర్శిరెడ్డి, మద్దూరు క్రిష్ణారెడ్డి, నారాయణ, శేఖర్‌ పాల్గొన్నారు.

మెగా డీఎస్సీతో భరోసా...

మెగా డీఎస్సీ నిర్వహించి నిరుద్యోగులకు టీడీపీ ప్రభుత్వం భరోసా ఇచ్చిందని ఎమ్మెల్యే అన్నారు. 2026లో ఎంపికైన ఉపాధ్యాయులు ఉయ్యాలవాడ గ్రామానికి చెందిన భార్యభర్తలు కందుకూరు రామాంజేయులు, నాగమణి, అలాగే చంద్రమౌలాలిని కలిసి దైర్యం చెప్పారు. ఉద్యోగం కోసం వారు పడ్డ కష్టాన్ని అడిగి తెలుసుకున్నారు. వైసీపీ దుష్ప్రచారాన్ని నమ్మవద్దన్నారు.

కళాశాల అభివృద్ధికి కృషి

శిరివెళ్ల: యర్రగుంట్ల ప్రభుత్వ డిగ్రీ, జూనియర్‌ కళాశాలల అభివృద్ధికి కృషిచేస్తానని ఎమ్మెల్యే అఖిలప్రియ అన్నారు. గురువారం తనిఖీ చేసి రికార్డులు, తరగతి గదులు, మౌళిక సదుపాయాలను పరిశీలించారు. విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. అధ్యాపకుల కొరత, కళాశాలవద్ద ఆర్టీసీ బస్సులు నిలపడ లేదని, మధ్యాహ్న భోజనం ఏర్పాటు సమస్యలను విద్యార్థులు తెలిపారు. సమస్యల పరిష్కారానికి, కళాశాలల అభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ప్రిన్సిపాల్‌ ఇంద్రావతి, శ్రీనివాసులు పాల్గొన్నారు.

అనంతరం మాట్లాడుతూ రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో రాజీపడే ప్రసక్తే లేదని, గత వైసీపీ ప్రభుత్వం సర్పంచుల ఖాతాల్లోని నిధులను పక్కదారి పట్టించి అభివృద్ధి కుంటుపడేలా చేసిందన్నారు. జగన్‌ ఏకగ్రీవాలకు మద్ధతిచ్చి.. నేడు ప్రతిపక్షంలో పోటీకి పిలుపునివ్వడం హాస్యాస్పదమన్నారు. ఆళ్లగడ్డలో ఎన్ని అరాచకాలకు పాల్పడినా బెదరకుండా గెలుచుకున్నామన్నారు.

Updated Date - Sep 18 , 2026 | 12:18 AM