స్వీయ నమోదును వినియోగించుకోవాలి
ABN , Publish Date - Apr 17 , 2026 | 11:10 PM
జనగణనలో భాగంగా కేంద్రం ప్రవేశపెట్టిన స్వీయ నమోదు విధానాన్ని ప్రజలు వినియోగించుకోవాలని కలెక్టర్ రాజకుమారి అన్నారు.
కలెక్టర్ రాజకుమారి
నంద్యాల నూనెపల్లి, ఏప్రిల్ 17 (ఆంధ్రజ్యోతి): జనగణనలో భాగంగా కేంద్రం ప్రవేశపెట్టిన స్వీయ నమోదు విధానాన్ని ప్రజలు వినియోగించుకోవాలని కలెక్టర్ రాజకుమారి అన్నారు. శుక్రవారం ఆమె క్యాంపు కార్యాలయంలో అధికారిక వెబ్‌సైట్ ద్వారా తన కుటుంబ వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసి ప్రజలకు అవగాహన కల్పించారు. కలెక్టర్ మాట్లాడుతూ ముందుగా పోర్టల్ నమోదు చేసుకుని మొబైల్ నం బరుకు వచ్చే ఓటీపీ ద్వారా ధ్రువీకరణ పూర్తిచేయాలన్నారు. కుటుంబ సభ్యుల వివరాలు, నివాస సమాచారం, విద్యాస్థాయి, ఉపాధి వంటి అం శాలను కచ్చితంగా నమోదు చేయాలన్నారు. ఒక కుటుంబానికి ఒక సెల్ నంబరు మాత్రమే ఉపయోగించాలన్నారు.
భూగర్భ జలాలు పెంచేందుకు కృషి చేయాలి
జిల్లాలో భూగర్భ జలాల మట్టాన్ని పెంచేందుకు సమష్టిగా కృషి చేయాలని కలెక్టర్ రాజకుమారి పిలుపునిచ్చారు. శుక్రవారం కలెక్ట రేట్లోని పీజీఆర్‌ఎస్ హాల్లో నిర్వహించిన జలధార కార్యక్రమానికి సంబంధించిన వర్క్‌షాప్‌లో ఆమె ఎంపీడీవోలు, ఇంజ నీరింగ్ అసి స్టెంట్లు, టెక్నికల్ అసిస్టెంట్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు తదితరులకు అవగా హన కల్పించారు. ప్రతి మండలానికి సంబంధించిన భూగర్భ జలాల గణాంకాలను సిద్ధం చేయాలని, గ్రామ, మండలాల వారీగా నీటి మట్టం వివరాలను సేకరించాలన్నారు. జిల్లాలో 27 కాస్కేడ్లలో మొత్తం 86 ట్యాం కులున్నాయన్నారు. భూగర్భ జలాల పెంపు కోసం ఫామ్ పాండ్స్, చెక్ డ్యామ్స్, రాక్ ఫిల్ డ్యామ్స్, కాంటూరు ట్రెంచెస్ వంటి నిర్మాణాలను, వాటి స్థితిగతులను అంచనా వేసి పునరుద్ధరణ చర్యలు చేపట్టాలన్నా రు. జలవనరుల శాఖ ఎస్‌ఈ శివశంకర్‌రెడ్డి, భూగర్భ జల శాఖాధికారి రఘురాం, డ్వామా పీడీ సూర్యనారాయణ, జడ్పీ డిప్యూటీ సీఈవో సుబ్బారెడ్డి, పంచాయతీ రాజ్ ఈఈ నాగరాజు పాల్గొన్నారు.