ఫారం పాండ్ తవ్వుకోండి
ABN , Publish Date - Apr 21 , 2026 | 12:18 AM
జలహారతి- జలధార పథకం కింద రైతులు వంకలు, వాగుల వృథాగా పోతున్న వర్షం నీటిని పొలాల్లోనే నిల్వ చేసుకునేందుకు ఫారం పాండ్స్‌ను తవ్వుకునేందుకు ప్రభుత్వం మంచి అవకాశాన్ని కల్పిస్తున్నదని ఉద్యాన శాఖ జిల్లా అధికారి రాజా కృష్ణారెడ్డి తెలిపారు
90వేల సబ్సిడీ
ఉద్యాన శాఖ జిల్లా అధికారి రాజా కృష్ణారెడ్డి
కర్నూలు అగ్రికల్చర్, ఏప్రిల్ 20 (ఆంధ్రజ్యోతి): జలహారతి- జలధార పథకం కింద రైతులు వంకలు, వాగుల వృథాగా పోతున్న వర్షం నీటిని పొలాల్లోనే నిల్వ చేసుకునేందుకు ఫారం పాండ్స్‌ను తవ్వుకునేందుకు ప్రభుత్వం మంచి అవకాశాన్ని కల్పిస్తున్నదని ఉద్యాన శాఖ జిల్లా అధికారి రాజా కృష్ణారెడ్డి తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ రైతులు సాగు చేసుకున్న పంటలను రక్షించుకునేందుకు ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తోందని అన్నారు. ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో జిల్లాలో పెద్ద ఎత్తున మామిడి, బత్తాయి, అరటి బొప్పాయి తదితర పండ్ల తోటల పెంపకానికి రైతులు ముందుకు వస్తున్నారని తెలిపారు. ఒక్కో ఫారం పాండ్ నిర్మాణానికి ప్రభుత్వం రూ.90వేలు సబ్సిడీని అందిస్తోందని తెలిపారు.