Share News

ఉరుకుంద ఈరన్న స్వామి హుండీ ఆదాయం రూ.1.24 కోట్లు

ABN , Publish Date - Nov 27 , 2026 | 11:06 PM

జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలలో ఒకటైన ఉరుకుంద ఈరన్న స్వామి దేవాలయంలో శుక్రవారం హుండీల ఆదాయాన్ని లెక్కించారు.

ఉరుకుంద ఈరన్న స్వామి హుండీ ఆదాయం రూ.1.24 కోట్లు
హుండీ లెక్కింపులో పాల్గొన్న సేవా సంఘం సభ్యులు

కౌతాళం, నవంబరు 27(ఆంధ్రజ్యోతి): జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలలో ఒకటైన ఉరుకుంద ఈరన్న స్వామి దేవాలయంలో శుక్రవారం హుండీల ఆదాయాన్ని లెక్కించారు. పాలక మండలి చైర్మన్‌ పాండురంగ శెట్టి, ఆలయ ఈవో వాణి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈవో మాట్లాడుతూ స్వామి వారి హుండీలో రూ.1,16,06,428, అన్నదానానికి రూ.8,06,280.. మొత్తం నగదు రూ.1,24,12,708, విదేశీ డాలర్లు 93, బంగారం 30.60 గ్రాములు, వెండి 12.9 కిలోలు భక్తులు కానుకగా సమర్పించారని తెలిపారు. కార్యక్రమంలో హుండీ లెక్కింపు పర్యవేక్షణ అధికారి, ఆదోని దేవదాయ శాఖ ఇన్‌స్పెక్టర్‌ వెంకటేశ్‌, పాలక మండలి సభ్యులు, దేవస్థానం పర్యవేక్షకులు, ఉరుకుంద ఏపీజీపీ బ్యాంకు సిబ్బంది, పోలీస్‌ సిబ్బంది, ఆదోనిశ్రీ భ్రమరాంభ సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు.

Updated Date - Nov 27 , 2026 | 11:06 PM