Share News

వేధిస్తున్న యూరియా కొరత

ABN , Publish Date - Mar 11 , 2026 | 12:13 AM

మండలంలో యూరియా కొరత వేధిస్తున్న వ్యవసాయాధికారులు పట్టించుకోవడం లేదని సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం మండల పరిషత్‌ కార్యాలయంలో ఎంపీపీ పోచా రమాదేవి అఽధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు.

వేధిస్తున్న యూరియా కొరత
ఏవో జ్యోతితో మాట్లాడుతున్న సర్పంచ్‌ శివశంకర్‌ రెడ్డి

వ్యవసాయాధికారులు పట్టించుకోవడం లేదు

మండల సమావేశంలో సభ్యుల ఆగ్రహం

సంజామల, మార్చి 10 (ఆంధ్రజ్యోతి): మండలంలో యూరియా కొరత వేధిస్తున్న వ్యవసాయాధికారులు పట్టించుకోవడం లేదని సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం మండల పరిషత్‌ కార్యాలయంలో ఎంపీపీ పోచా రమాదేవి అఽధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు. వివిధ శాఖల అధికారులు పురోగతి, పథకాల అమలును సభకు వివరించారు. ఏవో జ్యోతి తమ శాఖలో చేపడుతున్న పథకాలు, అభివృద్ది పనుల గురించి వివరిస్తుండగా, పేరుసోముల సర్పంచ్‌ శివశంకర్‌ రెడ్డి జోక్యం చేసుకుని యూరియా కొరతపై ఏం చర్యలు తీసుకుంటున్నారని ప్రశ్నించారు. ఏవో మాట్లాడుతూ యూరియాను రైతు సేవ కేంద్రాలకు అందజేశామని, మరింత అవసరమని ప్రభుత్వానికి నివేదిక పంపామన్నారు. సంజామలలో సీసీ రోడ్డు నిర్మించాలని, బొందలదిన్నెలో తాగునీటి సమస్య నివారణ పారిశుధ్య చర్యలు తీసుకోవాలని ఎంపీటీసీ రమణమ్మ కోరారు. రెవెన్యూ, రోడ్డు భవనాలు, ఆర్టీసీ అధికారులు గైర్హాజరయ్యారు. పాఽఽధ్యక్షుడు రాజశేఖర్‌ రెడ్డి, సర్పంచులు, ఎంపీటీసీలు, ఇన్‌చార్జి ఎంపీడీవో రామసుబ్బయ్య, ఎంఈవో వెంకట రమణరెడ్డి, సంజామల డాక్టర్‌ క్రిష్ణకుమారి, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఏఈ హరి్‌షరావు, పీఆర్‌ ఏఈ రషీద్‌, విద్యుత్‌ ఏఈ శ్రీనివాసులు ఉన్నారు.

Updated Date - Mar 11 , 2026 | 12:13 AM