పేదల అభ్యున్నతే లక్ష్యం : ఎమ్మెల్యే గిత్తా
ABN , Publish Date - Jul 13 , 2026 | 12:01 AM
పేదల అభ్యున్నతే కూటమి ప్రభుత్వ లక్ష్యమని నందికొట్కూరు ఎమ్మెల్యే జయసూర్య అన్నారు. మండలంలోని మల్యాల గ్రామంలో ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరైన చెక్కులను ఆదివారం లబ్ధిదారులకు పంపిణీ చేశారు.
పేదల అభ్యున్నతే లక్ష్యం : ఎమ్మెల్యే గిత్తా
నందికొట్కూరు రూరల్, జూలై 12 (ఆంధ్రజ్యోతి) : పేదల అభ్యున్నతే కూటమి ప్రభుత్వ లక్ష్యమని నందికొట్కూరు ఎమ్మెల్యే జయసూర్య అన్నారు. మండలంలోని మల్యాల గ్రామంలో ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరైన చెక్కులను ఆదివారం లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం పేద బడుగు బలహీన వర్గాల ప్రజల వెన్నంటి వుంటుందని.. వారికి అన్నిరకాలా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చూస్తామని అన్నారు. అనంతరం మల్యాల గ్రామంలో నక్కల మద్దిలేటికి రూ.9,45,393, నాగిరెడ్డికి రూ.81,964 చెక్కును అందజేశారు. కార్యక్రమంలో సీనియర్ టీడీపీ నాయకులు మాండ్ర సురేంద్రనాథరెడ్డి, బాల మద్దయ్య, వెంకటేశ్వర్లు, శ్రీరాములు, గ్రామ నాయకులు పాల్గొన్నారు.