అభివృద్ధికి ఐక్యతే ఆయుధం
ABN , Publish Date - Aug 03 , 2026 | 11:21 PM
సమాజంలో అభివృద్ధి సాధనకు ఐక్యతే ఆయుధమని రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఫరూక్ స్పష్టం చేశారు.
న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఫరూక్
నంద్యాల రూరల్, ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి) : సమాజంలో అభివృద్ధి సాధనకు ఐక్యతే ఆయుధమని రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఫరూక్ స్పష్టం చేశారు. సోమవారం మండల పరిధిలోని కానాల గ్రామంలో రూరల్ తహసీల్దార్ శ్రీవాణి ఆధ్వర్యంలో నిర్వహించిన పట్టాదార్ పాస్‌పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిఽథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత వైసీపీ పాలనలో నాయకులు ప్రభుత్వ ఆస్తులు ఎక్కడు ఉన్నాయా? ఎట్లా ఆక్రమి ంచుకో వాలా? అని వ్యవహరించారని అన్నారు. కూటమి ప్రభుత్వం ప్రజల ఆస్తులకు రక్షణగా నిలిచి, భూముల రీసర్వే నిర్వహించి రాజముద్రతో కూడిన పట్టాదార్ పాస్ పుస్తకాలను అందజేస్తున్నదని తెలిపారు. పరిశ్ర మల స్థాపన, ఉద్యోగాల కల్పన, భావితరాల భవిష్యత్ కోసం ముఖ్య మంత్రి చంద్రబాబు అహర్నిశలు శ్రమిస్తున్నారన్నారు. ప్రజలు ఐక్యంగా ఉంటేనే అభివృద్ధి సాధ్యమని అన్నారు. అనంతరం జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్ మాట్లాడుతూ పట్టాదార్ పుస్తకాలలో ఏమైనా సమ స్యలుంటే అధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు. ఈ కార్యక్రమంలో నంద్యాల మార్కెట్ యార్డు చైర్మెన్ గుంటుపట్టి హరిబాబు, నంద్యాల ఆర్డీవో చల్లా విశ్వనాఽథ్ పాల్గొన్నారు.
అభివృద్ధి, సంక్షేమం సమపాళ్లలో ముందుకు...: కూటమి ప్రభుత్వ పాలన అభివృద్ధి, సంక్షేమం సమపాళ్లలో ముందుకుసా గుతున్నదని మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్ పేర్కొన్నారు. సోమవారం మం డలం లోని కానాల గ్రామంలో నిర్వహించిన ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.