కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన రాజీనామా చేయాలి
ABN , Publish Date - Jul 19 , 2026 | 12:08 AM
దేశవ్యాప్తంగా నీట్ పరీక్షల్లో జరిగిన అవకతవకలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన రాజీనామా చేయాలని ఏపీ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి కె.జగన్నాథం డిమాండ్ చేశారు.
రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి కె.జగన్నాథం
కర్నూలు న్యూసిటీ, జూలై 18(ఆంధ్రజ్యోతి): దేశవ్యాప్తంగా నీట్ పరీక్షల్లో జరిగిన అవకతవకలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన రాజీనామా చేయాలని ఏపీ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి కె.జగన్నాథం డిమాండ్ చేశారు. ఢిల్లీలో సోనం వాంగ్‌చుక్ చేస్తున్న ఆమరణ నిరాహర దీక్షలకు మద్దతుగా శనివారం సీపీఐ ఆధ్వర్యంలో కేంద్ర మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ నగర సహాయ కార్యదర్శి మహేష్ అధ్యక్షతన ధర్నా చేపట్టారు. జగన్నాథం మాట్లాడుతూ కేంద్ర మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ పర్యావరణవేత్త రామ్ మెగసెసె అవార్డు గ్రహీత సోనం వాంగ్ చుక్ 19 రోజులుగా న్యూఢి ల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆమరణ నిరాహర దీక్ష చేపట్టార న్నారు. దీక్షలను పట్టించుకోకుండా ఢిల్లీ ప్రభుత్వం అర్థాంతరంగా ఈ రోజు దీక్షను భగ్నం చేయడం దుర్మార్గమైన చర్య అన్నారు. కార్యక్ర మంలో సీపీఐ నగర కార్యదర్శి పి.రామక్రిష్ణారెడ్డి, జిల్లా కార్యవర్గస భ్యులు జి.చంద్రశేఖర్, శ్రీనివాసులు, బీసన్న, అన్వర్ పాల్గొన్నారు.