Share News

నిరుద్యోగ భృతి అమలు చేయాలి

ABN , Publish Date - Mar 10 , 2026 | 12:48 AM

ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు నెలకు రూ.3వేల నిరుద్యోగ భృతి వెంటనే అమలు చేయాలని డీవైఎఫ్‌ఐ జిల్లా కమిటీ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది.

నిరుద్యోగ భృతి అమలు చేయాలి
కలెక్టరేట్‌ ఎదుట అర్ధనగ్న ప్రదర్శన చేస్తున్న నిరుద్యోగులు

డీవైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో ధర్నా

కర్నూలు ఎడ్యుకేషన, మార్చి 9(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు నెలకు రూ.3వేల నిరుద్యోగ భృతి వెంటనే అమలు చేయాలని డీవైఎఫ్‌ఐ జిల్లా కమిటీ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది. డీవైఎఫ్‌ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్‌ ఎదుట నిరుద్యోగులు అర్ధనగ్న ప్రదర్శన చేశారు. డీవైఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు రాఘవేంద్ర మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికా రంలోకి వచ్చి రెండేళ్లు అవుతున్నా ఇచ్చిన హామీలను అమలు చేయ కుండా నిరుద్యోగులను మోసం చేస్తుందని ఆరోపించారు. విద్యా సంస్థల్లో ఖాళీగా ఉన్న అధ్యాపకుల పోస్టులను భర్తీ చేయాలని, డీఎస్పీ, స్పెషల్‌ ఎడ్యుకేషన నోటిఫికేషన, ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ నోటిఫికే షన వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో డీవైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి అబ్దుల్లా, నాయకులు హుశేనబాషా, ప్రకాష్‌, హరికిషన రెడ్డి, సుకన్య, సాయి, ఉదయ్‌, నిరుద్యోగులు పాల్గొన్నారు.

Updated Date - Mar 10 , 2026 | 12:48 AM