Share News

యూ జీ డీ నీ దారేదీ ?

ABN , Publish Date - Mar 20 , 2026 | 12:42 AM

పట్టణానికి అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో అప్పటి పంచాయతీరాజ్‌ కమిషనర్‌ రామాంజనేయులు ఆలూరును దత్తత తీసుకుని 2017లో రూ.11 కోట్లు మంజూరు చేయించారు. పట్టణంలో 27 కి.మీ. పరిధిలో అన్ని కాలనీల్లో సర్వేచేసి, పనులు కూడా ప్రారంభించారు.

యూ జీ డీ నీ దారేదీ ?
కోయగనర్‌లో రోడ్డుపైనే నిలిచిన మురుగు.. బీసీ ఇంటిగ్రేటెడ్‌ హాస్టల్‌ వద్ద మురుగు

గతంలో రూ.11 కోట్లు మంజూరు, పనులు చేయలేనని తప్పుకున్న కాంట్రాక్ట్‌ సంస్థ

వెనక్కు వెళ్లిన నిధులు, మురుగుతో అల్లాడుతతున్న ఆలూరు ప్రజలు

ఆలూరు, మార్చి 19 (ఆంధ్రజ్యోతి): పట్టణానికి అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో అప్పటి పంచాయతీరాజ్‌ కమిషనర్‌ రామాంజనేయులు ఆలూరును దత్తత తీసుకుని 2017లో రూ.11 కోట్లు మంజూరు చేయించారు. పట్టణంలో 27 కి.మీ. పరిధిలో అన్ని కాలనీల్లో సర్వేచేసి, పనులు కూడా ప్రారంభించారు.

పట్టణమంతా మురుగు

అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ లేక మురుగు రోడ్లపైకి వస్తోంది. ఇళ్ల మధ్య మురుగు ఉండటంతోప్రరజలు అవస్థలు పడుతున్నారు. కోయనగర్‌లో సాంఘిక సంక్షేమ కార్యాలయంలోకి చేరడంతో అది మూతపడింది. దీంతో కార్యాలయాన్ని పత్తికొండకు తరలించారు. అలాగే ఫైర్‌ ఆఫీసు మొదలుకుని మోడల స్కూల్‌ మీదుగా జూనియర్‌ కళాశాల మీదుగా చెరువులోకి మురుగు వెళ్లాల్సి ఉండగా అక్కడే బ్లాక్‌ కావడంతో మురుగు నిలిచి దుర్వాసన వెదజల్లుతోంది. స్టేట్‌ బ్యాంకు సమీపంలో బీసీ ఇంటిగ్రేటెడ్‌ హాస్టల్‌ సమీపంలో మురుగు ముందుకు సాగడం లేదు. దీంతో స్థానికులు తమ ఇళ్లవద్ద ఇంకుడు గుంతలు తవ్వించుకుని మురుగు అందులోకి వెళ్లేవిధంగా చేసుకున్నారు.

పత్తాలేని కంపెనీ

యూజీడీ పనులను దక్కించుకున్న ముంబైకి చెందిన సుప్రీమ్‌ కంపెనీ పత్తా లేకుండా పోయింది. పనులు చేసేందుకు రూ.11 కోట్లు సరిపోవని మిన్నకుండిపోయింది. అధికారులు సమావేశాలు నిర్వహించి చేతులు దులుపుకున్నారు. చివరికి ఆర్‌డబ్ల్యూఎస్‌ శాఖకు పనులు అప్పగించారు. తర్వాత ప్రభుత్వం మారిపోయి వైసీపీ రావడంతో మంత్రిగా ఉన్న గుమ్మనూరు జయరాం ఉన్నా అండర్‌గ్రౌండ్‌ పనుల గురించి పట్టించుకుకోలేదనే విమర్శలు ఉన్నాయి.

టీడీపీ ప్రభుత్వంలోనైనా పూర్తయ్యేనా?

టీడీపీ అధికారంలోకి వచ్చింది, ఇకనైనా పట్టణంలో మురుగుకు శాశ్వతంగా పరిష్కారం చూపాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. ఈ ప్రభుత్వ హయాంలోనైనా వెనక్కు వెళళ్లన రూ.11 కోట్లు తిరిగి మంజూరు చేయించగలిగితే అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ నిర్మాణం పూర్తి అయ్యే అవకాశం ఉంది. ఇందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు కృషి చేయాలని ప్రజలు కోరుతున్నారు.

రోగాలతో ఆసుపత్రి పాలవుతున్నాం

ఆలూరులో కాలువలు లేకపోవడంతో ఏ వీధిలో చూసినా మురుగు ఇళ్ల మధ్యలో చేరుతోంది. దుర్వాసన రావడంతో పాటు దోమలువ్యాప్తి చెంది అనారోగ్యాల పాలవుతున్నాం. ఈ వానస భరించలేక పలుమార్లు ఇళ్లు కూడా మారాం. అధికారులు, ప్రజాప్రతినిదులు అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీని నిర్మిస్తే సమస్య ఉండదు. ఇప్పటికైనా స్పందింది పనులను పర్తిచేయాలి. - బులికొండప్ప, ఆలూరు

Updated Date - Mar 20 , 2026 | 12:42 AM