Share News

షరతులు లేని ప్రేమ యేసు క్రీస్తుది

ABN , Publish Date - Apr 03 , 2026 | 11:54 PM

షరతులు లేని ప్రేమ, ఎల్లలెరుగని త్యాగం క్రీస్తు ప్రభువుది అని ఆర్‌సీఎం కర్నూలు డయోసిస్‌ బిషప్‌ గోరంట్ల జ్వాన్నేష్‌ ఉద్బోధించారు.

షరతులు లేని ప్రేమ యేసు క్రీస్తుది
బిషప్‌ చర్చిలో శిలువ యాత్రను ప్రారంభిస్తున్న బిషప్‌ గోరంట్ల జ్వాన్నేష్‌

ఆర్‌సీఎం డయోసిస్‌ బిషప్‌ గోరంట్ల జ్వాన్నేష్‌

పవిత్ర ప్రార్థనలు, ఆరాధనల మధ్య ‘గుడ్‌ఫ్రైడే’

కర్నూలు కల్చరల్‌, ఏప్రిల్‌ 3(ఆంధ్రజ్యోతి): షరతులు లేని ప్రేమ, ఎల్లలెరుగని త్యాగం క్రీస్తు ప్రభువుది అని ఆర్‌సీఎం కర్నూలు డయోసిస్‌ బిషప్‌ గోరంట్ల జ్వాన్నేష్‌ ఉద్బోధించారు. గుడ్‌ఫ్రైడే (పవిత్ర శుక్రవారం) సందర్భంగా నగరంలోని నంద్యాల చెక్‌పోస్టు సమీపంలోని బిషప్‌ చర్చిలో శిలువ యాత్రను ఆయన ప్రారంభించారు. స్వయంగా శిలువను మోసి ఈయాత్రకు శ్రీకారం చుట్టారు. నగరంలోని చిల్డ్రన్స పార్కు వద్ద గల పునీత పెద్ద థెరీసమ్మ దేవాలయం నుంచి ఈ శిలువ యాత్ర లూర్థుమాత కేథడ్రిల్‌ (బిషప్‌ చర్చి) వరకు చేరుకుంది. బిషప్‌ చర్చిలో శిలువను మోసి ప్రేమగిరికి శిలువ యాత్రను కొనసాగించారు. ప్రేమ గిరికి చేరుకున్న అనం తరం బిషప్‌ గోరంట్ల జ్వాన్నేష్‌ శిలువ యాత్రలో అనుభవించిన 14 ముఖ్య ఘట్టాలను గుర్తు చేస్తూ సంప్రదాయ కార్యక్ర మాన్ని నిర్వహించారు. అంతకు మునుపు బిషప్‌ చర్చిలో పాస్టర్‌ సువర్ణరాజు బృందం నిర్వహించిన క్రీస్తు శిలువ పాటల స్మరణ వేషధారణ అందరికీ అలరింపజేసింది. కోల్స్‌ సెంటీనియల్‌ తెలుగు బాప్టిస్టు చర్చిలో శుక్రవారం క్రీస్తు శిలువపై పలికిన ఏడు మాటల ధ్యాన కూటమి సంఘ కాపరి రెవ. డాక్టర్‌ ఎస్‌జే జీవనరావ్‌ అధ్యక్షతన నిర్వహించారు. ఆర్‌ఎస్‌ రోడ్డులోని యోహోవా షమ్మా చర్చిలో హెప్సీ కుమారి క్రీస్తు పలికిన మొదటి మాటను తెలియజేశారు. కర్నూలు డయోసిస్‌ డీన ఫాదర్‌ జాన డేవిడ్‌, ఫాదర్లు జోజిరెడ్డి, ప్రతాపరెడ్డి, చిన్నపరెడ్డి, తోట జోసఫ్‌, సిస్టర్లు, నగర పౌరులు పాల్గొన్నారు.

ఆకట్టుకున్న శిలువ యాత్ర

గుడ్‌ఫ్రైడే సందర్భంగా నగరంలో భక్తిశ్రద్ధలతో నిర్వహించిన శిలువ యాత్ర అందరినీ ఆకట్టుకుంది. రక్షణ మందిరం (పందిపాడు) పాస్టర్‌ రెవ. వి.సువర్ణరాజు ఆధ్వర్యంలో, ఆయన క్రీస్తు వేషధారణతో ఈయా త్రను చేపట్టారు. వైసీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహనరెడ్డి, మైనారిటీ నాయకులు మన్సూర్‌ బాషా, పాస్టర్‌ గ్రేస్‌ సువర్ణ, పాస్టర్‌ జెట్టి ప్రభుదాస్‌, రోజ్లిన, ఇవాంజెలిన, అనంతర రాజేంద్రప్రసాద్‌ పాల్గొన్నారు.

రేపు ఈస్టర్‌

గుడ్‌ఫ్రైడే రోజున శిలువ మరణం చెందిన క్రీస్తుప్ర భువు పునరుత్థానుడై తిరిగి ఆదివారం జన్మించిన వేడుక ‘ఈస్టర్‌’ను ఆదివారం క్రైస్తవులు నిర్వహించుకోనున్నారు. జిల్లాలోని క్రైస్తవ ఆలయాల్లో ఈస్టర్‌ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు, దైవ సందేశాలను మత పెద్దలు అందించనున్నారు.

ఓర్వకల్లు: మండలంలోని ఓర్వకల్లు, పూడిచెర్ల, నన్నూరు, లొద్దిపల్లె, ఉయ్యాలవాడ, గుట్టపాడు, హుశేనాపురం, తిప్పాయపల్లె తదితర గ్రామాల్లో శుక్రవారం గుడ్‌ ఫ్రైడే ను కైస్త్రవులు భక్తి శ్రద్ధలతో జరుపు కున్నారు. తెల్లవారుజామున క్రైస్తవులు చర్చిలకు వెళ్లి ప్రార్థనలు చేశారు. ఓర్వకల్లు శిలువ మార్గాన్ని నిర్వహిస్తూ యేసుక్రీస్తు ఎదుర్కొన్న శ్రమను స్మరించుకున్నారు. హుశేనాపురంలో పాస్టర్‌ దేవరాజు యేసుప్రభు జీవితం గురించి వివరించారు. క్రైస్తవులు, పాస్టర్లు పాల్గొన్నారు.

సి.బెళగల్‌: మండలంలోని సిబెళగల్‌, పోలకల్లు, బురానదొడ్డి, బ్రాహ్మణ దొడ్డి, కొత్తకోట, కంబందహల్‌, ఇనగండ్ల, తిమ్మనదొడ్డి, సం గాల, చింతమా నుపల్లె, పలుకుదొడ్డి, కొండాపురం, పలుకుదొడ్డి, కొండా పురం గ్రామాలలో గుడ్‌ఫ్రైడేని పురస్కరించుకుని చర్చిలలో కైస్త్రవులు ప్రార్థనలు చేశారు. ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, టీడీపీ నాయకులు క్ర్తెస్తవు లకు గుడ్‌ఫ్రైడే శుభాకాంక్షలు తెలిపారు.

Updated Date - Apr 03 , 2026 | 11:54 PM