అనుమతి లేని డయాగ్నోస్టిక్ సెంటర్లను సీజ్ చేయాలి
ABN , Publish Date - Jul 18 , 2026 | 12:32 AM
ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్న డయాగ్నోస్టిక్ సెంటర్లను సీజ్ చేయాలని ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో డీఎంహెచవో డా.వై.కామేశ్వర ప్రసాద్‌కు వినతిపత్రం సమర్పించారు.
కర్నూలు హాస్పిటల్, జూలై 17(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్న డయాగ్నోస్టిక్ సెంటర్లను సీజ్ చేయాలని ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో డీఎంహెచవో డా.వై.కామేశ్వర ప్రసాద్‌కు వినతిపత్రం సమర్పించారు. శుక్రవారం జిల్లా వైద్యఆరోగ్యశాఖ కార్యాలయంలో ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి కే.శ్రీనివా సులు, నగర అధ్యక్ష, కార్యదర్శులు నాగరాజు బీసన్న డీఎంహెచవోను కలిశారు. వారు మాట్లాడుతూ బుధవారపేటలో కొంత మంది ప్రైవేటు వ్యక్తులు ప్రభుత్వం నుంచి అనుమతి లేకుండా డయాగ్నోస్టిక్ సెంటర్లు ఏర్పాటు చేసుకుని వైద్యపరీక్షలు నిర్వహిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారన్నారు. వీటిని సీజ్ చేయాలని ఎన్నోసార్లు జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారులు వినతి చేసినా, ఆందోళన చేసినా పట్టించుకోవడం లేదన్నారు. జిల్లా వ్యాప్తంగా పాలిక్లినిక్, క్లినిక్ సెంటర్లను అనుమతులు లేకుండా కన్సల్టెన్సిగా ఒక డాక్టర్ పేరుతో ప్రచారం కోసం మాత్రమే పెట్టుకుని ఎలాంటి అర్హత లేని వ్యక్తులు వైద్యం చేస్తున్నారని ఆరోపించారు.