త్యాగమూర్తి కన్యకా పరమేశ్వరి
ABN , Publish Date - Jan 20 , 2026 | 11:24 PM
ధర్మ రక్షణకు, సమాజ శ్రేయస్సుకు ఆత్మార్పణ చేసిన త్యాగమూర్తి కన్యకా పరమేశ్వరి అని ఎస్పీ సునీల్ షొరాణ్ పేర్కొన్నారు.
నంద్యాల క్రైం, జనవరి 20 (ఆంధ్రజ్యోతి): ధర్మ రక్షణకు, సమాజ శ్రేయస్సుకు ఆత్మార్పణ చేసిన త్యాగమూర్తి కన్యకా పరమేశ్వరి అని ఎస్పీ సునీల్ షొరాణ్ పేర్కొన్నారు. వాసవీ మాత పరమాత్మలో లీనమైన ఆత్మార్పణ దినోత్స వాన్ని పురస్కరించుకుని పోలీ సు కార్యాలయంలో కార్య క్ర మం నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారి చిత్రపటానికి పూలమాలలు వేసి భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) ఎన్. యు గంధర్ బాబు, ఏఆర్ డీఎస్పీ శ్రీనివాసులు, రిజర్వ్ ఇన్‌స్పెక్టర్లు మంజు నాథ్, సురేష్‌బాబు, ఆర్‌ఎస్‌ఐ హర్షవర్ధన్ రెడ్డి, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.