Share News

వైసీపీకి పాడె కట్టి రెండేళ్లు

ABN , Publish Date - Jun 04 , 2026 | 11:48 PM

అభివృద్ధిని విస్మరించిన వైసీపీ ప్రభుత్వానికి ప్రజలు పాడె కట్టి రెండేళ్లు పూర్తయిందని కుడా చైర్మన్‌ సొమిశెట్టి వెంకటేశ్వర్లు అన్నారు.

వైసీపీకి పాడె కట్టి రెండేళ్లు
మాట్లాడుతున్న సొమిశెట్టి వెంకటేశ్వర్లు

కుడా చైర్మన సోమిశెట్టి వెంకటేశ్వర్లు

కర్నూలు అర్బన్‌ , జూన్‌ 4(ఆంధ్రజ్యోతి): అభివృద్ధిని విస్మరించిన వైసీపీ ప్రభుత్వానికి ప్రజలు పాడె కట్టి రెండేళ్లు పూర్తయిందని కుడా చైర్మన్‌ సొమిశెట్టి వెంకటేశ్వర్లు అన్నారు. గురువారం సాయంత్రం నగ రంలోని జమ్మిచెట్టు వద్ద టీడీపీ నగర అధ్యక్షుడు కొరకంచి రవి, జిల్లా ప్రధాన కార్యదర్శి నాగరాజు యాదవ్‌ల ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం చేస్తున్న అభి వృద్ధిని చూసి వైసీపీ అధినేత జగన్‌ , ఆ పార్టీ నాయకులు జీర్ణించుకోలేక పోతున్నారన్నారు. కర్నూలు నియోజకవర్గం అభివృద్ధి కోసం కృషి చేస్తున్న మంత్రి టీజీ భరత్‌పై తప్పుడు విమర్శలు చేస్తే సహించమని హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు ఉమర్‌ ముక్తార్‌, సూరి మన్సుర్‌ ఆలీఖాన, క్టస్టర్‌ ఇనచార్జిలు, వార్డు ఇనచార్జిలు, అనుబంద సం ఘాల నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.

Updated Date - Jun 04 , 2026 | 11:48 PM