సుపరిపాలనకు రెండేళ్లు
ABN , Publish Date - Jun 04 , 2026 | 11:58 PM
సంక్షేమం - అభివృద్ధితో కూడిన సుపరిపాలనకు రెండేళ్లు పూర్తి అయిందని రోడ్లు భవనాల శాఖామంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి అన్నారు.
మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి
బనగానపల్లె, జూలై 4 (ఆంధ్రజ్యోతి): సంక్షేమం - అభివృద్ధితో కూడిన సుపరిపాలనకు రెండేళ్లు పూర్తి అయిందని రోడ్లు భవనాల శాఖామంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి అన్నారు. గురువారం ఆయన క్యాంపు కార్యాలయంలో విలేఖర్లతో మాట్లాడుతూ సమాజంలో అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ అభివృద్ధి ధ్యేయంగా కూటమి పాలన సాగుతోం దన్నారు. ప్రజలకు మెరుగైన రహదారులు, మౌలిక సదుపాయాలు కల్పించడమే కూటమి ప్రభుత్వ ధ్యేయమన్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంత రూపురేఖలు మార్చేలా రహదారులను అభివృద్ధి పరుస్తున్నట్లు తెలిపారు. సీఎం చంద్రబాబునాయుడు సమర్థ, సుస్థిర పాలనలో పెట్టుబడిదారుల్లో విశ్వాసం పెరిగిందన్నారు. మంత్రి లోకేశ్ చొరవతో రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు పెట్డడానికి పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తున్నారన్నారు. ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్‌ల జోడీతో సమగ్రాభివృద్ధివైపు ఆంధ్రప్రదేశ్ పయనిస్తోందని మంత్రి తెలిపారు.
నేడు మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం: ప్రపంచ వర్యావరణ దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఉదయం బనగానపల్లె పట్టణ శివారులోని యాగంటిపల్లె రింగ్‌రోడ్డుకు ఇరువైపులా ఇరువైపులా మొక్కలు నాటే కార్యక్రమానికి రోడ్లు భవనాల శాఖామంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి శుక్రవారం శ్రీకారం చుట్టనున్నారు.