పిడుగుపాటుకు ఇద్దరు దుర్మరణం
ABN , Publish Date - Sep 21 , 2026 | 11:43 PM
పిడుగుపాటుకు ఇద్దరు దుర్మరణం చెందారు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. ఈఘటన మండలంలోని ఉప్పలపాడులో చోటుచేసు కుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన ముర్తుజాబీ(50), మహబూబ్ బీ(55) తమకున్న రెండెకరాల పొలంలో, ఎకరాలో టమోటా, మరో ఎకరాలో మిరప పంటను సాగుచేశారు.
మరో ఇద్దరికి గాయాలు
శోకసంద్రంలో కుటుంబ సభ్యులు
ఓర్వకల్లు, సెప్టెంబరు 21 (ఆంధ్రజ్యోతి):పిడుగుపాటుకు ఇద్దరు దుర్మరణం చెందారు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. ఈఘటన మండలంలోని ఉప్పలపాడులో చోటుచేసు కుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన ముర్తుజాబీ(50), మహబూబ్ బీ(55) తమకున్న రెండెకరాల పొలంలో, ఎకరాలో టమోటా, మరో ఎకరాలో మిరప పంటను సాగుచేశారు. సోమవారం పింజరి బుడ్డ సాహెబ్ భార్య ముర్తుజాబీ, ఆయన చెల్లెలు మహబూబ్‌బీ, అన్న కుమారులు రియాజ్, రహీమ్ టమోటా పండ్లు కోసేందుకు వెళ్లారు. సాయంత్రం భారీవర్షం పడింది. పొలం పక్కనే ఉన్న వేపచెట్టు కింద నిల బడ్డారు. ప్రమాదవశాత్తు పిడుగుపడి వదిన, మరదలైన ముర్తుజాబీ, మహబూబ్‌బీ అక్కడికక్కడే మరణించారు. రహీం, రియాజ్‌కు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని చికిత్స నిమిత్తం ఓర్వకల్లు పీహెచ్‌సీకి తరలించారు. విషయం తెలిసిన వెంటనే గ్రామస్థులు ఘటనాస్థలికి చేరుకొని పోలీసులకు సమాచారమిచ్చారు. ఎస్‌ఐ సునీల్‌కుమార్ అక్కడికి వచ్చి సంఘటనపై ఆరాతీశారు. కుటుం బ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. వదిన, మరదలు మరణించడంతో ఆ కుటుంబంతో పాటు గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పింజరి ముర్తుజాబీకి ఆరుమంది కూతుళ్లు ఉన్నారు. మహబూబ్‌బీకి వివాహైనప్పటికీ ఉప్పలపాడులోనే ఉంటూ కూలి పనిచేస్తూ జీవనం సాగిస్తుండేది. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కర్నూలు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ సునీల్ కుమార్ తెలిపారు.
బాధిత కుటుంబాన్ని ఆదుకుంటాం
ఉప్పలపాడు గ్రామంలో పిడుగుపాటుకు గురై మృతి చెందిన ముర్తుజాబీ, మహబూబ్‌బీ కుటుంబాలను ఆదుకుంటామని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి భరోసా ఇచ్చారు. ప్రభుత్వం తరుపున వచ్చే ఆర్థిక సాయాన్ని ఇప్పించేందుకు ఈ విషయాన్ని జిల్లా అధికారుల దృస్టికి తీసుకెళ్లి ఆదుకుంటామని హామీ ఇచ్చారు.