Share News

జీఎన్‌ఎ్‌సఎ్‌సలో రెండు మృతదేహాలు

ABN , Publish Date - Sep 18 , 2026 | 12:14 AM

): అవుకు రిజర్వాయర్‌ సమీపంలోని జీఎన్‌ఎ్‌సఎ్‌స కెనాల్‌లో బుధవారం ముగ్గురు గల్లంతు కాగా ఇద్దరి మృతదేహాలు గురువారం లభ్యమయ్యాయి. ఎస్డీఆర్‌ఎఫ్‌, గజఈతగాళ్లు, రెస్క్యూ సిబ్బంది కెనాల్‌లో గాలింపు చర్యలను చేపట్టారు. రిజర్వాయర్‌ నుంచి జీఎన్‌ఎ్‌సఎ్‌స హెడ్‌రెగ్యులేటర్‌ ద్వారా దాదాపు 8వేలు క్యూసెక్కుల నీటిని కడప జిల్లాకు తరలిస్తున్నారు.

జీఎన్‌ఎ్‌సఎ్‌సలో రెండు మృతదేహాలు
బాలుడు ఆరుష్‌, అప్రోజ్‌ మృతదేహాలు

లభ్యం కాని ఆసిఫ్‌ ఆచూకీ

సాయంత్రానికి గాలింపు చర్యలు నిలిపివేత

మృతదేహాలు ప్రభుత్వాస్పత్రికి తరలింపు

అవుకు, సెప్టెంబరు 17 (ఆంధ్రజ్యోతి): అవుకు రిజర్వాయర్‌ సమీపంలోని జీఎన్‌ఎ్‌సఎ్‌స కెనాల్‌లో బుధవారం ముగ్గురు గల్లంతు కాగా ఇద్దరి మృతదేహాలు గురువారం లభ్యమయ్యాయి. ఎస్డీఆర్‌ఎఫ్‌, గజఈతగాళ్లు, రెస్క్యూ సిబ్బంది కెనాల్‌లో గాలింపు చర్యలను చేపట్టారు. రిజర్వాయర్‌ నుంచి జీఎన్‌ఎ్‌సఎ్‌స హెడ్‌రెగ్యులేటర్‌ ద్వారా దాదాపు 8వేలు క్యూసెక్కుల నీటిని కడప జిల్లాకు తరలిస్తున్నారు. కెనాల్‌లో నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో గాలింపు చర్యలకు ఇబ్బందిగా మారింది. బెలుంశింగవరం గ్రామ సమీపంలో ఉదయం 11-30 గంటల సమయంలో బాలుడు ఆరిష్‌ మృతదేహం వెలికి తీశారు. సాయంత్రం 5-15 గంటల ప్రాంతంలో అప్రోజ్‌ మృతదేహాన్ని కెనాల్‌ నుంచి బయటకు తీశారు. డోన్‌ డీఎస్పీ శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో పోలీస్‌, రెవెన్యూ, ఎస్సార్బీసీ అఽధికారులు గాలింపు చర్యలను పర్యవేక్షిస్తున్నారు. వెలికి తీసిన రెండు మృతదేహాలను పోలీసులు పోస్టుమాస్టరం నిమిత్తం అవుకు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఒక మోస్తరు వర్షం పడటం, వెలుతురు సరిగా లేక పోవటంతో సాయంత్రం 6:45 గంటలకు అధికారులు గాలింపు చర్యలు నిలిపి వేశారు. ఆసిఫ్‌ ఆచూకీ లభ్యం కావాల్సి ఉంది.

ప్రవాహాన్ని చూసేందుకు వెళ్లి మృత్యుఒడికి..

అప్రోజ్‌ స్వగ్రామం బేతంచర్ల మండల కేంద్రం. కుటుంబాన్ని పోషించుకునేందుకు ఏడాది క్రితం రామాపురం గ్రామానికి వలస వచ్చాడు. ఓ నాపరాతి ఫ్యాక్టరీలో పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. గ్రామ సమీపంలోని రిజర్వాయర్‌ నుంచి జీఎన్‌ఎ్‌సఎ్‌స హెడ్‌రెగ్యులేటర్‌ ద్వారా కడప జిల్లాకు 8వేలు క్యూసెక్కుల నీటిని తరలిస్తున్నారు. ఆ నీటి ప్రవాహాన్ని తిలకించేందుకు కుమారుడు ఆరిష్‌, బావమరిది ఆసి్‌ఫతో కలిసి కెనాల్‌ వద్దకు వచ్చారు. కొడుకు ప్రమాదవశాత్తు కెనాల్‌లో పడిపోయాడు. బాబును కాపాడేందుకు మొదట తండ్రి ఆప్రోజ్‌ నీటిలోకి దిగాడు. అతను కూడా నీటి ప్రవాహానికి కొట్టుకుపోతుండగా బామమరిది ఆసిఫ్‌ సైతం కెనాలోకి దూకినట్లు అక్కడి స్థానికులు చెప్పారని కుటుంబ సభ్యులు తెలిపారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు గల్లంతు కావడంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.

బాధితులకు అండగా ఉంటా: మంత్రి బీసీ

గాలేరు నగరి సుజల స్రవంతి కెనాల్‌లో గల్లంతైన బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం మండల టీడీపీ అధ్యక్షుడు ఉగ్ర సేనారెడ్డి, టీడీపీ నాయకులు రామకృష్ణారెడ్డి, మారం పుల్లారెడ్డితో కలసి సంగపట్నం సమీపంలోని జీఎన్‌ఎ్‌సఎ్‌స కెనాల్‌ వద్దకు చేరుకొని బాధిత కుటుంబాన్ని పరామ ర్శించారు. కెనాల్‌లో గాలింపు చర్యలు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశిం చారు. మంత్రి మాట్లాడుతూ ఒకే కుటుంబానికి చెందిన అప్రోజ్‌తో పాటు ఆయన కుమారుడు ఆరిష్‌, బావమరిది ఆసిఫ్‌ కెనాల్‌లో గల్లంతు కావటం బాధాకరమ న్నారు. ఎస్డీఆర్‌ఎఫ్‌, గజ ఈతగాళ్లు రెస్క్యూ సిబ్బందిని రంగంలోకి దించి గాలిం పు చర్యలు చేపట్టామన్నారు. డీఎస్పీ శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో పోలీసు బృందాలు, రెవె న్యూ, ఎస్సార్బీసీ అధికారులు గాలింపు చర్యలను పర్యవేక్షించాలని ఆదేశించామన్నారు. బాధిత కుటుంబం పరిస్థితిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఆర్థికసాయం అందేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. తహసీల్దార్‌ ఫకీర్‌అహ్మద్‌, సీఐలు మంజునాథరెడ్డి, ప్రవీణ్‌ కుమార్‌, వెంకట్రామిరెడ్డి, ఎస్సార్బీసీ డీఈలు సాయికిరణ్‌, మల్లికార్జున, ఆర్‌ఐ వెంగళరెడ్డి, పీడీవో శ్రీనివాసులు, వీఆర్‌వోలు ఓబులేసు, కంబయ్య పాల్గొన్నారు.

Updated Date - Sep 18 , 2026 | 12:14 AM