Share News

రెండు సెంట్ల స్థలం ఇవ్వాలి: సీపీఐ

ABN , Publish Date - Oct 11 , 2026 | 12:09 AM

అర్హులైన పేద లందరికీ రెండు సెంట్ల స్థలం ఇవ్వాలని కోరుతూ ఈనెల 26న చలో విజ యవాడ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు కే.రామాం జనేయులు పిలుపుని చ్చారు.

రెండు సెంట్ల స్థలం ఇవ్వాలి: సీపీఐ
మాట్లాడుతున్న సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గసభ్యుడు రామాంజనేయులు

కర్నూలు న్యూసిటీ, అక్టోబరు 10 (ఆంధ్రజ్యోతి): అర్హులైన పేద లందరికీ రెండు సెంట్ల స్థలం ఇవ్వాలని కోరుతూ ఈనెల 26న చలో విజ యవాడ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు కే.రామాం జనేయులు పిలుపుని చ్చారు. సీపీఐ నగర సమితి అధ్వర్యంలో స్థానిక కలెక్టరేట్‌ ఎదుట చేస్తున్న దీక్షలు శనివారం ఆరవ రోజుకి చేరాయి. దీక్షలకు సంఘీబావం తెలిపిన అనంతరం రామాంజనేయులు మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండున్న సంవత్సరం అవుతున్నప్పటికీ అర్హత ఉన్న ఏ ఒక్క పేదవాడికి రెండు సెంట్ల స్థలం ఇవ్వలేదన్నారు. ఎస్‌యూసీఐ జిల్లా నాయకులు నాగన్న, సీపీఐ ఎంఎల్‌మాస్‌ లైన నాయకులు వెంకటేశ్వర్లు, సీపీఐ నగర కార్యదర్శి రామక్రిష్ణారెడ్డి, నాగరాజు, బీసన్న, భద్రకుమార్‌, నల్లన్న పాల్గొన్నారు.

Updated Date - Oct 11 , 2026 | 12:09 AM