ఒకే గదిలో రెండు అంగన్‌వాడీ కేంద్రాలు!
ABN , Publish Date - Feb 09 , 2026 | 12:04 AM
మండలంలోని పేరూరు గ్రామంల ప్రాధమిక పాఠశాల ఆవరణలోని ఒకే గదిలో రెండు అంగన్‌వాడీ కేంద్రాలను నిర్వహిస్తున్నాఉ. చిన్న గదిలో వెదురు తడికెను అడ్డుగా పెట్టి ఓ వైపు 1వ కేంద్రం, మరో వైపు 2వ కేంద్రం ఏర్పాటు చేయడంతో చిన్నారులు కూర్చోవడానికి ఆహారం తినడానికి ఇబ్బందులు పడుతున్నారు.
ఇబ్బందుల్లో చిన్నారులు
రుద్రవరం, ఫిబ్రవరి 8 (ఆంధ్రజ్యోతి): మండలంలోని పేరూరు గ్రామంల ప్రాధమిక పాఠశాల ఆవరణలోని ఒకే గదిలో రెండు అంగన్‌వాడీ కేంద్రాలను నిర్వహిస్తున్నాఉ. చిన్న గదిలో వెదురు తడికెను అడ్డుగా పెట్టి ఓ వైపు 1వ కేంద్రం, మరో వైపు 2వ కేంద్రం ఏర్పాటు చేయడంతో చిన్నారులు కూర్చోవడానికి ఆహారం తినడానికి ఇబ్బందులు పడుతున్నారు. 2వ కేంద్రానికి మంజూరయిన అంగన్వాడీ కేంద్రం పనులు పునాదులకే పరిమితం కావడంతో ఇబ్బందులు తప్పడం లేదు. అంగన్వాడీ కార్యకర్త దానమ్మ మాట్లాడుతూ భవనాన్ని పూర్తిచేయాలని అధికారుల దృష్టికి తీసుకెళ్లామన్నారు.