చోరీ కేసులో ఇద్దరు నిందితుల అరెస్టు
ABN , Publish Date - Jul 12 , 2026 | 12:23 AM
నాలుగో పట్టణ పోలీస్ స్టేషన పరిధిలో ఆర్టీసీ బస్టాండులో జరిగిన రెండు చోరీ కేసులను పోలీసులు ఛేదించారు.
కర్నూలు క్రైం, జూలై 11(ఆంధ్రజ్యోతి): నాలుగో పట్టణ పోలీస్ స్టేషన పరిధిలో ఆర్టీసీ బస్టాండులో జరిగిన రెండు చోరీ కేసులను పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ఇద్దరు నిందితులు భాగ్య, హనుమమ్మను అరెస్టు చేశారు. సీఐ విక్రమసింహ తెలిపిన వివరాలివీ.. గత నెల 11న ఓ మహిళ గిద్దలూరు వెళ్లేందుకు బస్టాండులో బస్సు కోసం వేచి ఉండగా.. ఆమె మెడలోని బంగారు గొలుసును అపహరించారు. అలాగే పెద్దపాడు చెందిన ఓ బ్యాంకు ఉద్యోగిని విధులకు వెళ్లందుకు బస్టాండులో వేచి ఉండగా.. ఆమె మెడలోని గొలుసును చోరీ చేశారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ ఫుటేజీలను పరిశీలించారు. ఓ ఇద్దరు మహిళలు చోరీకి పాల్పడి న ట్లుగా గుర్తించి ఆరా తీశారు. ఆ ఇద్దరు తమిళనాడు రాష్ట్రం జోలార్ పే టకు చెందిన భాగ్య, హనుమమ్మలుగా గుర్తించారు. ఇద్దరిని అరెస్టు చేసి వారి వద్ద నుంచి ఆరున్నర తులాల బంగారు నగలు రికవరీ చేశారు.