Share News

దొంగతనం కేసులో ఇద్దరి అరెస్టు

ABN , Publish Date - Nov 02 , 2026 | 11:44 PM

జల్సాలు, చెడు వ్యసనాలకు అలవాటు పడి దొంగతనాలు చేస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. ఏఎస్పీ సుస్మిత పట్టణంలోని సీసీఎస్‌ పోలీ్‌సస్టేషన్‌లో వివరాలు వెల్లడించారు.

దొంగతనం కేసులో ఇద్దరి అరెస్టు
నిందితుల అరెస్టు చూపుతున్న ఏఎస్పీ సుస్మిత, సీఐలు

51 గ్రాముల బంగారం, 1.2 కిలోల వెండి, రూ.54 వేలు స్వాధీనం

నంద్యాల నూనెపల్లి, నవంబరు 2 (ఆంధ్రజ్యోతి): జల్సాలు, చెడు వ్యసనాలకు అలవాటు పడి దొంగతనాలు చేస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. ఏఎస్పీ సుస్మిత పట్టణంలోని సీసీఎస్‌ పోలీ్‌సస్టేషన్‌లో వివరాలు వెల్లడించారు. ఈ ఏడాది నంద్యాల తాలూకా, టూ టౌన్‌, త్రీ టౌన్‌ పోలీసుస్టేషన్ల పరిధిలో తరచూ దొంగతనాలకు పాల్పడుతూ తప్పించుకుని తిరుగుతున్న కర్నూలు చెన్నమ్మ సర్కిల్‌కు చెందిన మహేశ్‌, నంద్యాల శ్యామ్‌నగర్‌కు చెందిన నాగేంద్రను నంద్యాల శివారులోని రాణిమహారాణి వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి మూడు స్టేషన్ల పరిధిలో దొంగతనం చేసిన 51 గ్రాముల బంగారు, 1.2 కిలోల వెండి ఆభరణాలు, రూ.54 వేలు నగదు, ఒక ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నారు. మహేశ్‌పై గతంలో కర్నూలు, నంద్యాల పోలీసుస్టేషన్ల పరిధిలలో సుమారు 34 కేసులున్నాయి. నిందితులను అరెస్టు చేయడంతో నంద్యాల తాలూకా సీఐ ఈశ్వరయ్య, సీసీఎస్‌ ఇన్‌స్పెక్టర్‌ సురేశ్‌కుమార్‌, పోలీసు సిబ్బంది ఇబ్రహీం, మాలిక్‌బాషా, వెంకటేశ్వర్లు, చిన్నమద్దిలేటి, గంగారామ్‌, కృష్ణయ్యనాయుడును ఎస్పీ సునీల్‌ షెరాన్‌, ఏఎస్పీ సుస్మిత అభినందించారు.

Updated Date - Nov 02 , 2026 | 11:45 PM