ఇద్దరు నిందితుల అరెస్టు
ABN , Publish Date - Jun 30 , 2026 | 12:43 AM
మహారాష్ట్ర ప్రాంతానికి చెందిన ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసి వారి వద్ద రూ 1,08,000 నగదును, రాగి వైయర్‌ను స్వాధీనం చేసుకొని అరెస్ట్ చేసిన్నట్లు కోవెలకుంట్ల సీఐ హనుమంతు నాయక్ పేర్కొన్నారు.
రూ 1,08,000 నగదు, రాగి వైర్ స్వాధీనం
మరో ముగ్గురు నిందితులు పరార్
కోవెలకుంట్ల, జూన్ 29 (ఆంధ్రజ్యోతి): మహారాష్ట్ర ప్రాంతానికి చెందిన ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసి వారి వద్ద రూ 1,08,000 నగదును, రాగి వైయర్‌ను స్వాధీనం చేసుకొని అరెస్ట్ చేసిన్నట్లు కోవెలకుంట్ల సీఐ హనుమంతు నాయక్ పేర్కొన్నారు. సోమవారం కోవెలకుంట్ల పట్టణంలోని సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో నిందితులను హాజరు పరచి వివరాలు వెల్లడించారు. ఎస్పీ సునీల్ షెరాన్ ఆదేశాల మేరకు ఆళ్ళగడ్డ డీఎస్పీ శ్రీనివాసరావు, కోవెలకుంట్ల సీఐ హనుమంతు నాయక్ పర్యవేక్షణలో రేవనూరు ఎస్‌ఐ ధనుంజయ్, సిబ్బంది, సిసిఎస్ సిఐ సురేష్, వారి సిబ్బంది రాబడిన సమాచారం మేరకు ఈ నెల 28న సాయంత్రం 5.30 గంటలకు రేవనూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని వల్లంపాడు, లింగాల గ్రామాల మధ్య ఉన్న వాటర్ ట్యాంక్ వద్ద ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి విచారించగా నంద్యాల జిల్లా బండిఆత్మకూరులో, నంద్యాల తాలుకా పరిధిలోని పులిమద్ది గ్రామంలో రేవనూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని కలుగొట్ల గ్రామంలో విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌ను పగులగొట్టి అందులో ఉన్న రాగి వైయర్‌ను అపహరించుకుని వెళ్లినట్లు వారు ఒప్పుకున్నారని తెలిపారు. వారి వద్ద నుండి రాగి వైయర్‌ను, నగదును స్వాధీనం చేసుకున్నారని అన్నారు. . మహారాష్ట్ర పర్‌భాని జిల్లా సిర్సికూడ్ గ్రామానికి చెందిన అంకుష్ అభిమాన్ బొస్లే, మహారాష్ట్ర పర్‌బాని గ్రామం లోహగాన్ గ్రామానికి చెందిన సంజయ్ లక్ష్మణ్ హర్‌గోమ్‌కర్ అనే ఇద్దరు వ్యక్తులు, మరో ముగ్గురితో కలిసి నంద్యాల జిల్లాలో 25/02/2026న బండి ఆత్మకూరు వద్ద ఉన్న ట్రాన్స్‌ఫార్మర్‌ను పగులగొట్టి అందులో ఉన్న రాగి వైయర్‌ను అపరించుకుని వెళ్లారని, 18/01/2026న నంద్యాల తాలుకా పరిధిలోని పులిమద్ది గ్రామంలో ఉన్న ట్రాన్స్‌ఫార్మర్‌ను పగులగొట్టి అందులో ఉన్న రూ 1,40,000 విలువ చేసే రాగి వైయర్‌ను అపహరించుకుని వెళ్లారని వెళ్లిన్నట్లు తెలిపారు. అలాగే 24/02/2026 రేవనూరు పోలీస్ స్టేషన్ సమీపంలోని కలుగొట్ల సమీపంలోని కుందూనది ఒడ్డున వాటర్ పంపు వద్ద ఉన్న ట్రాన్స్‌ఫార్మర్‌ను పగులగొట్టి అందులో ఉన్న సుమారు 50కేజిల రాగి వైయర్‌ను దొంగిలించుకుని పారిపోయారని తెలిపారు. ఈ కేసులో నిందితులైన ఇద్దరిని అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి రూ 1,08,000 నగదును, రాగి వైయర్‌ను స్వాధీనం చేసుకొని రేవనూరు ఎస్‌ఐ ధనుంజయ్, సిబ్బంది కలిసి అరెస్ట్ చేయడం జరిగిందని ఆయన తెలిపారు. ఈ కేసును చేధించినందుకు ఎస్పీని ఎస్‌ఐని, సిబ్బందిని, సీసీఎస్ సీఐ సురేస్, సిబ్బందిని అభినందించడం జరిగిందని ఆయన తెలిపారు.