అమ్మగీసిన అపురూపం..!
ABN , Publish Date - Feb 22 , 2026 | 12:51 AM
కొందరు అదృష్టమంటారు, మరికొందరు వంశపారంపర్యమంటారు. కారణం ఏదైనా.. కవలలుగా పుట్టడం ఓ విభిన్నం.. విచిత్రం..! సాధారణంగా కవలలు ఒకరిని పోలి మరొకరు ఉండటం ఒక ఎత్తయితే, ఒకే లాంటి అభిరుచులు, అలవాట్లు కలిగి ఉండటం మరో విశేషం. వాస్తవానికి ఒకే తల్లి గర్భం నుంచి ఒకేసారి ఒక్కరికన్నా.. ఎక్కువ మందిని జన్మస్తే.. వారిని కవలలుగా పేర్కొంటారు.
కవలలకు ఓ ప్రత్యేక రోజు
పోలెండ్ నుంచి పాకిన వేడుక
నేడు ప్రపంచ కవలల దినోత్సవం
ఆత్మకూరు, ఫిబ్రవరి 21(ఆంధ్రజ్యోతి): కొందరు అదృష్టమంటారు, మరికొందరు వంశపారంపర్యమంటారు. కారణం ఏదైనా.. కవలలుగా పుట్టడం ఓ విభిన్నం.. విచిత్రం..! సాధారణంగా కవలలు ఒకరిని పోలి మరొకరు ఉండటం ఒక ఎత్తయితే, ఒకే లాంటి అభిరుచులు, అలవాట్లు కలిగి ఉండటం మరో విశేషం. వాస్తవానికి ఒకే తల్లి గర్భం నుంచి ఒకేసారి ఒక్కరికన్నా.. ఎక్కువ మందిని జన్మస్తే.. వారిని కవలలుగా పేర్కొంటారు. నేడు ప్రపంచ కవలల దినోత్సవాన్ని పురస్కరించుకుని ‘ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక కథనం.
ప్రపంచ వ్యాప్తంగా నాలుగు దశాబ్దాల నుంచి..
ప్రపంచంలో మొట్టమొదటి సారి కవలలు దినోత్సవాన్ని పోలెండ్‌లో 1976లో నిర్వహించారు. వేదాల్లో అశ్వినీ దేవతలు, రామాణయంలో లవకుశలు, మహాభారతంలో సకులసహదేవులు కవలలుగా మనకు తెలుసు. ప్రపంచవ్యాప్తంగా గత నాలుగు దశాబ్దాల నుంచి అనేక దేశాలు ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తూ వస్తున్నాయి. పోలెండ్‌లో జన్మించిన మోజస్, ఆరన్‌విల్‌కాక్స అనే కవల సోదరులు మరణించిన రోజును ప్రపంచ కవలల దినోత్సవం నిర్వహిస్తున్నారు.
పుట్టే ప్రతి 1000 మందిలో..
ప్రపంచవ్యాప్తంగా 125 మిలియన్ల కవలలు ఉన్నట్లు 2006లో ఓ అంతర్జాతీయ సర్వే సంస్థ పేర్కొంది. పుట్టే ప్రతి 1000మంది కవలల్లో కేవలం 32మంది మాత్రమే జీవిస్తున్నారని ఈ సర్వేలో వెల్లడైంది. ప్రపంచవ్యాప్తంగా కవలలు ఎక్కువగా ఉన్న దేశం యోరుబా. ఈ దేశంలో పుట్టే ప్రతి 1000 మందిలో 42 మంది కవలలే. భారతదేశంలో అలహాబాద్ సమీపంలోని మహమ్మద్‌ఉమ్రి గ్రామం కవలల గ్రామంగా పేరుగాంచింది. కారణం ఈ గ్రామంలో 600 మంది జనాభా వుండగా 33 జతల కవలలు ఉండటం గమనార్హం.
ఒకే రకమైన స్వభావం
ఆళ్లగడ్డ మండలం ఆర్. క్రిష్ణాపురం గ్రామానికి చెందిన రమేశ్, కవిత దంపతులకు కవలలు జన్మించారు. ఒకరిని విడిచి మరొకరు ఉండలేరు. అభిరుచులు కూడా ఒకే రకంగా ఉంటాయి. అన్ని విషయాల్లో చురుకుగా ఉంటారు. స్వభావం, అభిప్రాయాలు, ఆలోచనలు ఒకే రకంగా ఉంటాయి. బంధువులు కూడా గుర్తించలేనంతగా పోలికలు ఉన్నాయి. గీతాంషి ఎం గీతాని
ఒకరిని మించి మరొకరి ఉత్సాహం
ఆత్మకూరు పట్టణంలోని కొండా వెంకటస్వామి, త్రివేణి దంపతులకు మొదటి సంతానంగా దేష్నాశ్రీ, దేవజ్‌నంద అనే కవలలు జన్మించారు. వీరిలో లింగభేదం వున్నప్పటికీ ఇరువురు భలే చురుగ్గా వుంటారు. పైగా వీరు చాలా దగ్గరి పోలికలు కలిగి ఉంటారు. చిన్నప్పటి నుంచి ఇద్దరికి మంచి జ్ఞాపకశక్తి కలదు.
- ట్విన్స్, ఆత్మకూరు
అభిరుచులు, అలవాట్లు ఒక్కటే
ఆత్మకూరుకి చెందిన ముక్తార్‌బాషా, అర్షియా దంపతులకు 8ఏళ్ల క్రితం అయాజ్, అఫ్పాన్ అనే కవలలు జన్మించారు. చిన్నప్పటి నుంచి వారి అభిరుచులు, అలవాట్లు ఒక్కటే. తినే తిండిలోను, వేసే డ్రస్సుల్లోను ఇలా అన్నింటిని ఒకే రకంగా ఉండాలని కోరుకుంటున్నారు ఈ కవలలు. - అయాజ్, అఫ్పాన్ - ట్విన్స్ బ్రదర్స్, ఆత్మకూరు