Share News

ఐఎ్‌ఫఎల్‌ ప్యానల్‌ పగలగొట్టిన దుండగులు

ABN , Publish Date - Jul 10 , 2026 | 12:26 AM

విద్యార్థులకు ఆన్‌లైన్‌ క్లాసులు వినేందుకు ఏర్పాటు చేసిన ఐఎ్‌ఫఎల్‌ ప్యానెల్‌ను దుండగులు పగులకొట్టారని తుగ్గలి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు అగస్టీన్‌ తెలిపారు.

ఐఎ్‌ఫఎల్‌ ప్యానల్‌ పగలగొట్టిన దుండగులు
తుగ్గలి జడ్పీ ఉన్నత పాఠశాలలో పగిలిపోయిన ప్యానల్‌

ఫ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు

తుగ్గలి, జూలై 9 (ఆంధ్రజ్యోతి):విద్యార్థులకు ఆన్‌లైన్‌ క్లాసులు వినేందుకు ఏర్పాటు చేసిన ఐఎ్‌ఫఎల్‌ ప్యానెల్‌ను దుండగులు పగులకొట్టారని తుగ్గలి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు అగస్టీన్‌ తెలిపారు. గురువారం మండల కేంద్రమైన తుగ్గలి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి బీ-సెక్షన్‌లో క్లాస్‌ రూములో ఉన్న రూ.1.30 లక్షలు విలువ చేసే ఐఎ్‌ఫఎల్‌ ప్యానల్‌ను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారని, ఈ ఘటనపై పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు ప్రధానోపాధ్యాయుడు తెలిపారు. వాచ్‌మెన్‌ సక్రమంగా విధులు నిర్వర్తిస్తే ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోవని ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు అన్నారు.

Updated Date - Jul 10 , 2026 | 12:26 AM