అలజఢీ
ABN , Publish Date - Oct 17 , 2026 | 11:19 PM
నంద్యాల మున్సిపల్ చైర్మన్ టీడీపీ అభ్యర్థి ఎంపిక ఉత్కంఠగా మారింది. శనివారం రాత్రి వరకు అభ్యర్థి ఖరారు కాకపోవడం మరింత అలజడి రేపుతోంది.
నంద్యాల మున్సిపల్ టీడీపీ అభ్యర్థి ఎంపికపై ఉత్కంఠ
రెండో రోజూ కొనసాగిన నామినేషన్ల జోరు
చైర్పర్సన్ స్థానాలకు 35, వార్డు మెంబర్లకు 554 నామినేషన్లు
నంద్యాల, అక్టోబరు17(ఆంధ్రజ్యోతి): నంద్యాల మున్సిపల్ చైర్మన్ టీడీపీ అభ్యర్థి ఎంపిక ఉత్కంఠగా మారింది. శనివారం రాత్రి వరకు అభ్యర్థి ఖరారు కాకపోవడం మరింత అలజడి రేపుతోంది. రెండు రోజులుగా కొత్తకొత్త పేర్లు తెరపైకి రావడం సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది. మొదటి నుంచి టీడీపీ రాష్ట్ర మాజీ కార్యదర్శి ఏవీఆర్ ప్రసాద్, మరో టీడీపీ నాయకుడు శివశంకర్ యాదవ్, మనిచార్ ఖలీల్ పేర్లు వినిపించడంతో పాటు ఐవీఆర్ సర్వే కూడా చేసినట్లు తెలుస్తోంది. ఆతర్వాత మంత్రి కుమారుడైన ఎన్ఎండీ ఫయాజ్ పేరుతో పాటు పట్టణానికి చెందిన వరప్రసాద్ సతీమణి చంద్రకళ పేర్లు తెరపైకి వచ్చాయి. ఈక్రమంలో చంద్రకళ సైతం శనివారం నామినేషన్ కూడా వేశారు. తాజాగా మరో ఇద్దరు డాక్టర్ బాబన్, డాక్టర్ అరీఫా పేర్లు తెరపైకి రావడం సర్వత్రా ఉ త్కంఠ రేపుతోంది. ఏవీఆర్ ప్రసాద్, శివశంకర్ యాదవ్పై కోర్టు తీర్పు పెండింగ్లో ఉండటంతో దాదాపు వీరికి అవకాశం దక్కకపోవచ్చని తెలుస్తోంది. మంత్రి కుమారుడు ఎన్ఎండీ ఫయాజ్ పేరు ఖరారయ్యే అవకాశం లేకపోలేదు.
ఒక్కసారిగా పెరిగాయి..
రెండో రోజైన శనివారం మాత్రం ఒక్కసారిగా నామినేషన్లు పె రిగాయి. డోన్, నందికొట్కూరు, బేతంచెర్ల టీడీపీ అభ్యర్థులు ఎం పిక ఆలస్యంగా రావడంతో వీరందరూ ఆదివారం నామినేషన్లు వే యనున్నారు. నంద్యాల మున్సిపాలిటీ చైర్మన్ ఎంపికపై ఇటు టీ డీపీ, అటు వైసీపీలోనూ గందరగోళ పరిస్థితి నెలకొంది. అభ్యర్థి ఎంపికపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. దీంతో ఆశావహులతో రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ రేపుతోంది. జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల్లో ఇప్పటి వరకు ఆరు మున్సిపాలిటీ చైర్మన్, చైర్పర్సన్ అభ్యర్థుల పరంగా 35, 212 వార్డుల పరంగా 554నామినేషన్లు దాఖలయ్యాయి. చైర్పర్సన్ పరంగా అత్యధికంగా డోన్, వార్డుల పరంగా నంద్యాల, డోన్లో నామినేషన్లు దాఖలయ్యాయి
ముచ్చటగా మూడోసారి..
చివరిగా తెరపైకి వచ్చిన చంద్రకళ(నామినేషన్ దాఖలు చేసి న), డాక్టర్ బాబన్, డాక్టర్ అరీఫాపై ముచ్చటగా మూడోసారి కూటమి ఐవీఆర్ కాల్స్పై ఆధారపడింది. మరోవైపు వైసీపీ కూడా కూటమి పార్టీ అభ్యర్థి ఎంపికను చూసి వైసీపీ అభ్యర్థిని ఖరారు చేయాలని చూస్తోంది. నంద్యాల చైర్మన్ పీఠం అభ్యర్థి ఎంపికపై సందిగ్ధం నెలకొంది.
భద్రత కట్టుదిట్టం
నేడు నామినేషన్ల పక్రియకు చివరిరోజు కావడంతో జిల్లా పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల పరిధిలో శనివారం రాత్రి నుంచే భద్రతను కట్టుదిట్టం చేశారు. డ్రోన్ కెమెరాలతో నిఘా పెంచారు. అడిషనల్ ఎస్పీ ఖాదర్బాషా, నంద్యాల, డోన్, ఆళ్లగడ్డ, ఆత్మకూరు, డీఎస్పీల నేతృత్వంలో బందోబస్తు పెంచారు. చివరి రోజైన ఆదివారం ఏవిధంగా నామినేషన్ల పక్రియ సాగుతుందోనని అని అన్ని వర్గాల్లో ఆందోళన మొదలైంది.