Share News

స్పెషల్‌ క్యాంపెయిన డేకు విశేష స్పందన

ABN , Publish Date - Aug 31 , 2026 | 12:05 AM

నియోజకవర్గ పరిధి లోని అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో నిర్వహించిన స్పెషల్‌ క్యాంపెయిన డేకు విశేష స్పందన లభించిందని కర్నూలు ఈఆర్వో, కమిషనర్‌ చల్లా ఓబు లేసు అన్నారు.

స్పెషల్‌ క్యాంపెయిన డేకు విశేష స్పందన
సర్‌ ప్రక్రియను పరిశీలిస్తున్న ఈఆర్వో, కమిషనర్‌ చల్లా ఓబులేసు

కర్నూలు ఈఆర్వో, కమిషనర్‌ చల్లా ఓబులేసు

కర్నూలు న్యూసిటీ, ఆగస్టు 30(ఆంధ్రజ్యోతి): నియోజకవర్గ పరిధి లోని అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో నిర్వహించిన స్పెషల్‌ క్యాంపెయిన డేకు విశేష స్పందన లభించిందని కర్నూలు ఈఆర్వో, కమిషనర్‌ చల్లా ఓబు లేసు అన్నారు. ఆదివారం సి.క్యాంపు మున్సిపల్‌ ప్రాథమిక పాఠశాల, సిల్వర్‌ జుబ్లీ కళాశాలలో ఈ కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు. ఈఆర్వో మాట్లాడుతూ అవసరమైన సమయం అందించేందుకు ఫారం-6, 6ఏ, 7, 8ల స్వీకరణకు నిర్వహించిన ప్రత్యేక ప్రచార దినాలకు విశేష స్పందన లభించిందన్నారు. మే 19 నుంచి ఆగస్టు 29 వరకు నియోజక వర్గంలో మొత్తం 10,608 దరఖాస్తులు అందినట్లు ఆయన తెలిపారు. ఇందులో నమూనా-6 ద్వారా 4653, 6ఏ ద్వారా 108, నమూనా 7 ద్వారా 94, నమూనా 8 ద్వారా 5775 దరాఖాస్తులు స్వీకరించామన్నారు. ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 2434 మందికి నోటీసులు జారీచేశామని, విచారణ నిర్వహించి, అభ్యర్థనలు, అభ్యంతరాలను బీఎల్‌ వోలు స్వీకరించాల న్నారు. నిర్ధేశిత గడువు లోపు ఈ ప్రక్రియను పూర్తిచేసి అనంతరం తుది ఓటర్ల జాబితాను అక్టోబరు 3న ప్రచురించేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు.

Updated Date - Aug 31 , 2026 | 12:05 AM