అడ్డంగా నరికేస్తున్నారు
ABN , Publish Date - Jul 14 , 2026 | 12:19 AM
మొక్కలు నాటి సంరక్షించాలని ప్రభుత్వం ఓ వైపు ప్రచారం చేస్తుంటో మరోవైపు అక్రమార్కులు ఏళ్లతరబడి పెరిగిన భారీ వృక్షాలను అడ్డంగా నరికేస్తున్నారు. వృక్షాలు కాలుష్యాన్ని నివారించడంతోపాటు,
కొలిమిగుండ్లలో ఇష్టానుసారంగా చెట్ల నరికివేత
కొలిమిగుండ్ల, జూలై 13 (ఆంధ్రజ్యోతి): మొక్కలు నాటి సంరక్షించాలని ప్రభుత్వం ఓ వైపు ప్రచారం చేస్తుంటో మరోవైపు అక్రమార్కులు ఏళ్లతరబడి పెరిగిన భారీ వృక్షాలను అడ్డంగా నరికేస్తున్నారు. వృక్షాలు కాలుష్యాన్ని నివారించడంతోపాటు, వర్షాలు కురిసేందుకు, వరదలు వస్తే అడ్డుకునేందుకు ఉపయోగం. వృక్షాలలను అనుమతి లేకుండా నరకకూడదని ప్రభుత్వం వాల్టా(నీరు, భూమి మరియు చెట్ల సంరక్షణ) చట్టం చేసింది. అయితే వాల్టా చట్టాన్ని అమలు చేయడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో అక్రమార్కులు ఇష్టానుసారంగా భారీ వృక్షాలను నరికేస్తూ వాటి మొద్దులను వాహనాల్లో తరలిస్తున్నారు. మండలంలోని కొలిమిగుండ్ల, బెలుం, కల్వటాల, పెట్నికోట చింతలాయపల్లె, ఇటిక్యాల, గ్రామాల ప్రధాన రహదారులతో పాటు పొలాల వద్ద ఉన్న మహా వృక్షాలను నరికి దుంగలను ఆటోలు, ట్రాక్టర్లలో కట్టెల డిపోలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ఇప్పటికైనా ఈ దందాను అరికట్టి వృక్షాలను రక్షించాలని, పర్యావరణవేత్తలు, ప్రజలు, రైతులు కోరుతున్నారు.