జాతీయ ప్రమాణాలతో వైద్యం చేయాలి
ABN , Publish Date - Jan 10 , 2026 | 12:02 AM
జిల్లాలోని ప్రభుత్వ వైద్యశాలలు జాతీయ వైద్య ప్రమాణాలతో ప్రజలకు సేవలు అందించాలని కలెక్టర్ ఏ.సిరి జిల్లా వైద్యాధికారులను ఆదేశించారు.
కలెక్టర్ ఏ. సిరి
కర్నూలు కలెక్టరేట్, జనవరి 9 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని ప్రభుత్వ వైద్యశాలలు జాతీయ వైద్య ప్రమాణాలతో ప్రజలకు సేవలు అందించాలని కలెక్టర్ ఏ.సిరి జిల్లా వైద్యాధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో ప్రజారోగ్య సౌకర్యాలకు సంబంధించి నేషనల్ క్వాలిటీ అష్యూరెన్స్ స్టాండర్డ్స్ సర్టిఫికేషన్ అంశంపై డీఎంహెచ్‌వో, డీసీహెచ్‌ఎ్‌స తదితరులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ జాతీయ నాణ్యత హామీ ప్రమాణాల (ఎన్‌క్యూఏఎ్‌స) సర్టిఫికేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు.
పారిశుధ్య పనులను సక్రమంగా నిర్వహించాలి
గ్రామాల్లో ఇంటింటికి చెత్త సేకరణతో పాటు పారిశుధ్య పనులను ప్రజలు పూర్తి స్థాయిలో సంతృప్తి చెందే విదంగా నిర్వహించాలని కలెక్టర్ ఏ.సిరి అధికారులను ఆదేశించారు. జిల్లాలోని డిప్యూటీ ఎంపీడీవోలు, పంచాయతీ కార్యదర్శులతో గ్రామాల్లో చెత్త సేకరణ, పారిశుధ్యం, పరిశుభ్రత అంశాలపై కలెక్టర్ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. చెత్త సేకరణ వాహనాలు గ్రామంలోని అన్ని వీధులు, కాలనీలు కవర్ చేసేలా రోజువారీగా పని చేయాలన్నారు. టెలీ కాన్ఫరెన్స్‌లో డీపీవో భాస్కర్, జిల్లాలోని డిప్యూటీ ఎంపీడీవోలు, పంచాయతీ సెక్రటరీలు పాల్గొన్నారు.