పారదర్శకంగా సేవలు
ABN , Publish Date - Nov 15 , 2026 | 11:45 PM
ప్రజలకు నిష్పక్షపాతంగా, పారదర్శకంగా సేవలందిస్తున్నామని ఎస్పీ సునీల్ షెరాన్ అన్నారు.
ఎస్పీ సునీల్ షెరాన్
నంద్యాల నూనెపల్లి, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి): ప్రజలకు నిష్పక్షపాతంగా, పారదర్శకంగా సేవలందిస్తున్నామని ఎస్పీ సునీల్ షెరాన్ అన్నారు. ఆదివారం ఆయన ఎస్పీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో 2026 జనవరి నుంచి అక్టోబరు వరకు జరిగిన సంఘటనలు, చేపట్టిన కార్యక్రమాలు వివరించారు. నేరాలను సిబ్బంది సహకారంతో కట్టడి చేశామన్నారు. 2025లో 47 హత్యలకు సంబంధించి కేసులు నమోదుకాగా 2026లో 42 కేసులు నమోదు కావడంతో నేరాలు తగ్గుముఖం పట్టాయన్నారు. 2025తో పోల్చితే 2026లో కేసులు తగ్గాయన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక దృష్టి సారించామన్నారు. ఒకసారి రోడ్డు ప్రమాదం జరిగిన చోట మరోసారి అదే ప్రాతంలో పునరావృతం కాకుండా వాహన వేగాలను నియంత్రిం చడానికి రేడియం స్టిక్కర్లు అతికించిన బారికేడ్స్ ఏర్పాటు చేశామన్నారు. జిల్ల్లాలో 2025లో 4,054 కేసులు నమోదుకాగా 2026లో జనవరి నుంచి అక్టోబరు వరకు 2973 కేసులు మాత్రమే నమోదు కావడంతో నేరాలు గణనీయంగా తగ్గినట్లు పేర్కొన్నారు.