పారదర్శకంగా జొన్న కొనుగోలు
ABN , Publish Date - Apr 21 , 2026 | 10:56 PM
జొన్నల కొను గోళ్లలో పారదర్శకతే ప్రామాణికం అని రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్ పేర్కొన్నారు.
రాష్ట్ర న్యాయ, మైనార్టీ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్
నంద్యాల రూరల్, ఏప్రిల్ 21 (ఆంధ్రజ్యోతి) : జొన్నల కొను గోళ్లలో పారదర్శకతే ప్రామాణికం అని రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్ పేర్కొన్నారు. మంగళవారం టెక్కె మార్కెట్ యార్డులో రాష్ట్ర మార్క్‌ఫెడ్ డైరెక్టర్ తులసిరెడ్డితో కలిసి 2005-2006కు సంబంధించి జొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం రైతుసేవా కేంద్రాల ద్వారా మద్దతు ధరతో కొనుగోలు చేస్తుందన్నారు. దళారుల ప్రమే యం లేకుండా క్వింటం హైబ్రిడ్ మహీంద్ర రకం రూ 3.699, మల్దండి రకం రూ 3.799 మద్దతు ధరకు కొంటున్నట్లు తెలిపారు. గింజలలో తేమశాతం 13శాతంలోపు, చెడిపోయిన గింజలు 1శాతం మాత్రమే ఉండాలన్నారు. ఈపంట, ఈకేవైసీ నమోదు చేసుకున్న రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. రైతులకు ఏమైనా సమస్య లుంటే టోల్ ఫ్రీ నెంబర్ 1967 లేదా జిల్లా కంట్రోల్ రూం నెంబర్ 08514- 294866కు ఫోన్ చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో చల్లా విశ్వనాథ్, నంద్యాల రూరల్, అర్బన్ ఎమ్మార్వోలు శ్రీవాణి, శ్రీనివాసులు, ఎంపీడీవో సుగుణశ్రీ, మండల వ్యవసాయ అధికారి ప్రసాద్‌రావ్ తదితరులు పాల్గొన్నారు.