Share News

పారదర్శకంగా కూటమి ప్రభుత్వ పాలన

ABN , Publish Date - Aug 08 , 2026 | 11:29 PM

కూటమి ప్రభుత్వం ప్రజలకు పారదర్శకంగా పాలన అందిస్తోందని రాష్ట్ర న్యాయ, మైనార్టీ శాఖల మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌ అన్నారు.

పారదర్శకంగా కూటమి ప్రభుత్వ పాలన
సూచనలు చేస్తున్న మంత్రి ఫరూక్‌

అభివృద్ధి పనుల్లో పురోగతిని సాధించాలి

రాష్ట్ర న్యాయ, మైనార్టీ శాఖల మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌

నంద్యాల రూరల్‌, ఆగస్టు 8 (ఆంధ్రజ్యోతి) : కూటమి ప్రభుత్వం ప్రజలకు పారదర్శకంగా పాలన అందిస్తోందని రాష్ట్ర న్యాయ, మైనార్టీ శాఖల మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌ అన్నారు. శనివారం పట్టణంలోని బొమ్మలసత్రంలో ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌ్‌సలో అధికారులతో సమగ్ర సమావేశం నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనుల్లో మరింత పురోగతి సాధించాలన్నారు. ప్రతి ప్రభుత్వ శాఖలో కార్యాచరణ ప్రణాళికలను అనుకున్న లక్ష్యం మేరకు సమర్థవతంగా నిర్వహించాలని సూచించారు. అన్ని శా ఖల అధికారులు సమస్వయంతో పనిచేస్తూ నంద్యాల నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ప్రథమస్థానంలో నిలపాలని కోరారు. మున్సిపల్‌ కమిషనర్‌ బండి శేషన్న, ఆర్డీవో చల్లా విశ్వనాథ్‌, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Aug 08 , 2026 | 11:29 PM