Share News

ట్రాఫిక్‌ నిబంధనలు పాటించాలి

ABN , Publish Date - Apr 09 , 2026 | 12:11 AM

ప్రతి ఒక్కరూ ట్రాఫిక్‌ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని ఎస్పీ విక్రాంత పాటిల్‌ అన్నారు

ట్రాఫిక్‌ నిబంధనలు పాటించాలి
హెల్మెట్‌ను పంపిణీ చేస్తున్న ఎస్పీ విక్రాంత పాటిల్‌, వైద్యులు

ఎస్పీ విక్రాంత పాటిల్‌

అవగాహన ర్యాలీ ప్రారంభం

కర్నూలు హాస్పిటల్‌, ఏప్రిల్‌ 8(ఆంధ్రజ్యోతి): ప్రతి ఒక్కరూ ట్రాఫిక్‌ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని ఎస్పీ విక్రాంత పాటిల్‌ అన్నారు. బుధవారం కర్నూలు కిమ్స్‌ హాస్పిటల్‌ న్యూరోసర్జరీ విభాగం ఆధ్వర్యంలో అంతర్జాతీయ న్యూరోసర్జరీ దినోత్సవం సందర్భంగా నగరంలోని రాజ్‌విహా ర్‌లో రోడ్డు భద్రత అవగాహన ర్యాలీని ఎస్పీ ప్రారంభించి మాట్లాడారు. రోజు రోజుకు పెరుగుతున్న వాహనాల సంఖ్యకు అనుగుణంగా ప్రజలు మరింత జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు. వేగం నియంత్రణ, మద్యం సేవించి వాహనం నడపకపోవడం, ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ పాటించడం వంటి అంశాలు అత్యంత కీలకమన్నారు. అనంతరం కిమ్స్‌ హాస్పిటల్‌ ఆధ్వర్యంలో హెల్మెట్‌లు ధరించని వాహనదారులకు ఎస్పీ హెల్మెట్లు పంపిణీ చేశారు. న్యూరోసర్జన డాక్టర్‌ సుమంత కుమార్‌ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువగా తలకు గాయాలు అవుతాయని, తలకు గట్టి దెబ్బ తగిలితే మెద డు, వెన్నెముకపై తీవ్ర ప్రభావం పడుతుం దని అన్నారు. కార్యక్రమంలో కిమ్స్‌ హాస్పిటల్‌ ఏవీపీ డాక్టర్‌ ఆదిత్య, సీనియర్‌ న్యూరోసర్జన డాక్టర్‌ డబ్లూ సీతారామ్‌, న్యూరోసర్జరీ వైద్యులు మార్కెటింగ్‌ జీఎం ఆనంద్‌ పాల్గొన్నారు.

Updated Date - Apr 09 , 2026 | 12:11 AM