Share News

డోన్‌లో ట్రాఫిక్‌ కష్టాలు

ABN , Publish Date - Nov 28 , 2026 | 11:57 PM

పట్టణంలో ట్రాఫిక్‌ సమస్య రోజురోజకు తీవ్రమవుతుండటంతో పాదచారులు, వాహనదారులు అవస్థలు పడుతున్నారు. వాహనాల సంఖ్య విపరీతంగా పెరిగిపోవడంతో రహదారులు సరిపోవడం లేదు. అలాగే గ్రామాల నుంచి వివిధ పనుల నిమిత్తం వచ్చేవారితో సమస్య పెరుగుతూ వస్తుంది. అలాగే బేతంచెర్ల ప్రధాన రోడ్డు మలుపులు ప్రమాదకరంగా ఉండడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

డోన్‌లో ట్రాఫిక్‌ కష్టాలు
ప్లైఓవర్‌పై నిలిచిపోయిన వాహనాలు

పూర్తికాని రహదారి విస్తరణ

రైలు వచ్చిందంటే చాలు భారీగా నిలిచిపోతున్న వాహనాలు

డోన్‌ రూరల్‌, నవంబరు 28(ఆంధ్రజ్యోతి): పట్టణంలో ట్రాఫిక్‌ సమస్య రోజురోజకు తీవ్రమవుతుండటంతో పాదచారులు, వాహనదారులు అవస్థలు పడుతున్నారు. వాహనాల సంఖ్య విపరీతంగా పెరిగిపోవడంతో రహదారులు సరిపోవడం లేదు. అలాగే గ్రామాల నుంచి వివిధ పనుల నిమిత్తం వచ్చేవారితో సమస్య పెరుగుతూ వస్తుంది. అలాగే బేతంచెర్ల ప్రధాన రోడ్డు మలుపులు ప్రమాదకరంగా ఉండడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

నత్తనడకన రహదారి విస్తరణ పనులు..

కోట్లవారి పల్లె నుంచి పట్టణంలోని చాకిరేవు మెట్టవరకు చేస్తున్న పనులు పూర్తికాకపోవడంతో ఇబ్బందు తప్పడం లేదు. పట్టణ నడిబొడ్డులో రెండు రైల్వే గేట్లు ఉండడం డోన్‌ రైల్వేజంక్షన్‌ కావడంతో అరగంకోసారి రైలు వస్తుండటంతో గేట్లు పడుతూ సమస్య తీవ్రం అవుతోంది. పాతబస్టాండ్‌ కంబాలపాడు సర్కిల్‌ రోడ్డులో డీఎస్పీ శ్రీనివాసులు వాహనాల పార్కింగ్‌ను క్రమబద్ధం చేసేందుకు ద్విచక్ర చర్యలు తీసుకున్నారు. అయితే ట్రాఫిక్‌ సమస్య పూర్తిగా సమసిపోలేదు. .

ట్రాఫిక్‌ను నియంత్రించాలి

పట్టణంలో ట్రాఫిక్‌ నియంత్రణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. రోజురోజుకు ట్రాఫిక్‌ పెరిగి ఇబ్బందులు పడుతున్నారు. పాలకవర్గం అధికారులు దృష్టి పెట్టాలి - విజయ్‌ కుమార్‌, యువజన కాంగ్రెస్‌ నాయకుడు

పాలకవర్గంతో చర్చిస్తాం..

పట్టణంలో ట్రాపిక్‌ నియంత్రణకు డీఎస్పీ శ్రీనివాసులుతో కలిసి సర్వే చేశాం. పాలకవర్గం సమావేశంలో ఈ సమస్యపై చర్చించి, పరిష్కరిస్తాం. - నరేష్‌ రెడ్డి, మున్సిపల్‌ కమిషనర్‌, డోన్‌.

Updated Date - Nov 28 , 2026 | 11:57 PM