Share News

శ్రీశైలంలో ట్రాఫిక్‌ జామ్‌

ABN , Publish Date - Aug 15 , 2026 | 11:24 PM

శ్రీశైల క్షేత్రం భక్తులతో సందడిగా మారింది. ప్రభుత్వ సెలవు రోజులు కలిసిరావడంతో ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజలు కుటంబ సమేతంగా ఒక్కసారిగా రావడంతో క్షేత్ర పుర వీధులు కిటకిటలాడాయి

శ్రీశైలంలో ట్రాఫిక్‌ జామ్‌
శ్రీశైలం దారిలో కి.మీ మేర నిలిచిపోయిన వాహనాలు

క్షేత్రానికి చేరుకునేందుకు గంటల తరబడి బారులు

శ్రీశైలం, ఆగస్టు 15 (ఆంధ్రజ్యోతి): శ్రీశైల క్షేత్రం భక్తులతో సందడిగా మారింది. ప్రభుత్వ సెలవు రోజులు కలిసిరావడంతో ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజలు కుటంబ సమేతంగా ఒక్కసారిగా రావడంతో క్షేత్ర పుర వీధులు కిటకిటలాడాయి. వేల సంఖ్య లో వాహనాలు క్షేత్రానికి 10 కిలో మీటర్లు దూరం నుంచి గంటల తరబడి బారులుదీరడంతో సుమారు నాలుగు గంటలు ట్రాఫిక్‌ మందకొడిగా సాగింది. అధిక సంఖ్యలో వచ్చిన భక్తులు వసతి గదులు పొందేందుకు ఇబ్బందులు పడ్డారు. భక్తుల రద్దీకి అనుగుణంగా ఆలయ అధికారులు అందరికీ సంతృప్తి కర దర్శనాలు కల్పించేందుకు ఏర్పాట్లు చేశారు. రాత్రివేళలో మాత్రమే పరి మితంగా స్వామివారి గర్భాలయ దర్శన, వీఐపీ టిక్కెట్లను కేటాయించినట్లు ఈవో శ్రీనివాసరావు తెలిపారు. ఆది వారం తెల్లవారు జాము నుంచి భక్తు లందరికీ అలంకార దర్శనాలు మాత్రమే కల్పిస్తున్నట్లు తెలిపారు. భక్తులు సహకరించాలని కోరారు.

Updated Date - Aug 15 , 2026 | 11:24 PM