Share News

సంత.. చింత

ABN , Publish Date - Jun 23 , 2026 | 11:49 PM

మండలకేంద్రంలో ప్రతి మంగళవారం సంత నిరవహిస్తారు. అయితే వందల సంఖ్యలో వ్యాపారులు, వేల సంఖ్యలో వినియోగదారులు రావడంతో వాహనాల రాకపోలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది.

సంత.. చింత
రోడ్డుపై నిలిచిన వాహనాలు, బస్సులు

కొలిమిగుండ్లలో మంగళవారం వారపు సంత..

రోడ్డుపైనే పార్కింగ్‌, రాకపోకలకు అంతరాయం, ఇబ్బందులు పడుతున్న స్థానికులు

కొలిమిగుండ్ల, జూన్‌ 23 (ఆంధ్రజ్యోతి): మండలకేంద్రంలో ప్రతి మంగళవారం సంత నిరవహిస్తారు. అయితే వందల సంఖ్యలో వ్యాపారులు, వేల సంఖ్యలో వినియోగదారులు రావడంతో వాహనాల రాకపోలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. ఎన్‌హెచ్‌-544డి ప్రధాన రహదారిపైనే వాహనాలను అడ్డదిడ్డంగా పార్కింగ్‌ చేస్తుండంతో ఇరువైపులా భారీ వాహనాలు నిలిచిపోతున్నాయి. కనీసం నడిచేందుకు కూడా ఇబ్బందులు తెలెత్తుతున్నాయని, ఇక అత్యవసర పరిస్థితుల్లో వెళ్లేందుకు సాధ్యం కావడం లేదని స్థానికులు వాపోతున్నారు. చిన్న పిల్లలు, వృద్దులు రోడ్డు దాటాలన్నా భయపడాల్సి వస్తోందని, పోలీసులు, పంచాయతీ అధికారులు ట్రాఫిక్‌ సక్రమంగా సాగేలా చూడాలని కోరుతున్నారు.

Updated Date - Jun 23 , 2026 | 11:49 PM