స్తంభించిన రాకపోకలు
ABN , Publish Date - Apr 12 , 2026 | 11:31 PM
స్థానిక వాల్మీకి సర్కిల్ సమీపంలోని ఉరుకుంద రోడ్డులో ఉన్న రైల్వేగేటు విరిగిప డటంతో దాదాపు గంట సేపు రాకపోకలు స్తంభించిపోయాయి.
కోసిగిలో విరిగిపడ్డ రైల్వేగేటు
కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు
ఇబ్బందులు పడ్డ ప్రజలు
ఎమర్జెన్సీ గేటుతో పునరుద్ధరణ
కోసిగి, ఏప్రిల్ 12 (ఆంధ్రజ్యోతి): స్థానిక వాల్మీకి సర్కిల్ సమీపంలోని ఉరుకుంద రోడ్డులో ఉన్న రైల్వేగేటు విరిగిప డటంతో దాదాపు గంట సేపు రాకపోకలు స్తంభించిపోయాయి. ఆదివారం ఉదయం 9గంటల సమయంలో రైల్వేగేటు ఒక్కసారి గా విరిగిపోయింది. దీంతో వాహనదారులు, ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రైలు వెళ్లిన అనంతరం గేట్‌మెన్ గేటును పైకి లేపే సమయంలో సాంకేతికసమస్యలతో గేటు ఒక్కసారిగా విరిగి కింద పడిపోయింది. శుభముహూర్తాలు ఎక్కువగా ఉండటంతో పెళ్ళిళ్లు, ఇతర శుభకార్యాలకు వెళ్లే వాహనదారులతో రద్దీ నెలకొంది. ఒక్కసారిగా గేటు విరిగిపోవడంతో రోడ్డుకు ఇరు వైపులా కిలోమీటరు మేర వాహనాలు నిలిచిపోయాయి. తీవ్ర ఎండలకు వాహనదారులు, మహిళలు, పిల్లలు, వృద్ధులు అల్లాడి పోయారు. రైల్వే గేట్‌మెన్, సిబ్బంది తక్షణమే స్పందించి సుమా రు గంటపాటు శ్రమించి విరగిపోయిన గేటును, కేబుల్‌వైర్లను పక్కకు తొలగించి మరమ్మతులు చేపట్టారు. అనంతరం ప్రత్యామ్నాయంగా ఉన్న ఎమర్జెన్సీ గేటు ను ఉపయోగించి వాహనాల రాకపోకలకు కల్పించారు. 10గంటల తర్వాత పరిస్థితి అదుపులోకి రావడంతో వాహనదారులు ఊపిరి పీల్చుకున్నారు.