Share News

వంతెన నిర్మాణంతో తీరనున్న ట్రాఫిక్‌ కష్టాలు

ABN , Publish Date - Oct 02 , 2026 | 12:05 AM

పట్టణంలోని శ్రీనివాసనగర్‌ వద్ద సమస్యలను పరిష్కరించేందుకు రూ.5.5కోట్లతో వంతెన నిర్మిస్తున్నట్లు ఎమ్మెల్యే కోట్ల అన్నారు. ఈ మేరకు గురువారం పనులకు భూమి పూజ చేశారు.

వంతెన నిర్మాణంతో తీరనున్న ట్రాఫిక్‌ కష్టాలు
వంతెన పనులను ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే కోట్ల

డోన్‌ టౌన్‌, అక్టోబరు 1 (ఆంధ్రజ్యోతి): పట్టణంలోని శ్రీనివాసనగర్‌ వద్ద సమస్యలను పరిష్కరించేందుకు రూ.5.5కోట్లతో వంతెన నిర్మిస్తున్నట్లు ఎమ్మెల్యే కోట్ల అన్నారు. ఈ మేరకు గురువారం పనులకు భూమి పూజ చేశారు. అనంతరం బేతంచెర్ల రోడ్డు శివాలయం సమీపం నుంచి పాతపేట అనుసంధానంగా రూ.89 లక్షలతో నిర్మించనున్న మరో వంతెన పనులను ప్రారంభిచారు. వంతెన నిర్మాణంతో ట్రాఫిక్‌ రద్దీ తగ్గుతుందన్నారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వలసల రామకృష్ణ, కోట్రికే ఫణిరాజ్‌, మాజీ మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ టీఈ కేశన్నగౌడు, మాజీ వైస్‌ చైర్మన్‌ కోట్రికే హరికిషణ్‌; బీజేపీ నాయకులు సందు వెంకటరమణ, టీఈ రాఘవేంద్ర గౌడు, శేషఫణిగౌడు, జిలేబీ ధను, మున్సిపల్‌ కమిషనర్‌ కే.నరేష్‌ రెడ్డి ఉన్నారు.

టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వలసల రామకృష్ణ, జిల్లా ఉపాధ్యక్షుడు సలీంద్ర శ్రీనివాసులు ఎర్రగుంట్ల గ్రాంమంలో పింఛన్లను పంపిణీ చేశారు క్లస్టర్‌ ఇన్‌చార్జి-2 కనపకుంట గోవిందరెడ్డి, నారాయణ, ఎర్రగుంట్ల నారాయణస్వామి, మాజీ సర్పంచ్‌ మద్దిలేటి, హోటల్‌ నారాయణ పాల్గొన్నారు.

టీడీపీతోనే పల్లె ప్రగతి

ప్యాపిలి: తెలుగుదేశం పార్టీతోనే పల్లె ప్రగతి సాధ్యమని డోన్‌ ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకా్‌షరెడ్డి అన్నారు. గురువారం నల్లమేకలపల్లి, రాంపురం, రాచవాండ్లపల్లి, జక్కసానికుంట్ల, హుసేనాపురం, బావిపల్లి గ్రామాల్లో పల్లె పండుగ 3.0 నిధులతో సిమెంటు రోడ్లు, గుకులం షెడ్ల నిర్మాణానికి శంఖుస్థాపన చేశారు. గ్రామాభివృద్ధే లక్ష్యంగా చంద్రబాబు ప్రభు త్వం పనిచేస్తుందన్నారు. రూ.3కోట్లతో మండలంలో అభివృద్ది పనులు చేపట్టనున్నట్లు తెలిపరు. వాటర్‌గ్రిడ్‌ ద్వారా తాగునీరు అందిస్తామన్నారు. డీసీఎంఎస్‌ చైర్మన్‌ వై.నాగేశ్వరరావుయాదవ్‌, వై లక్ష్మినారాయణ, రాజశేఖర్‌నాయుడు, సత్యం, శ్రీకాంత్‌, రాంపురం నాగేశ్వరావు, భాస్కర్‌నాయుడు, టి. నాగేశ్వరరావు, సుదర్శన్‌, జయరాముడు, చెన్నారెడ్డి, చంద్రశేఖర్‌, ప్రసాద్‌, సతీష్‌ పాల్గొన్నారు.

Updated Date - Oct 02 , 2026 | 12:05 AM