Share News

డోన్‌ పట్టణాభివృద్ధికి ముందడుగు : కోట్ల

ABN , Publish Date - Sep 23 , 2026 | 12:01 AM

డోన్‌ పట్టణ సమగ్ర అభివృద్ధిలో భాగంగా రహదారుల అభివృద్దికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. హైబ్రిడ్‌ యాన్యుటీ మోడల్‌ (హెచ్‌ఏఎం) విధానంలో రూ.21 కోట్ల అంచనా వ్యయంతో 13.18 కి.మీ.ల రహదారులు, బేతంచెర్ల నగర పంచాయతీ పరిధిలో రూ.17 కోట్ల వ్యయంతో పనులు చేయనున్నారు

 డోన్‌ పట్టణాభివృద్ధికి ముందడుగు : కోట్ల
శంకుస్థాపనలో పాల్గొన్న ఎమ్మెల్యే కోట్ల

డోన్‌ టౌన్‌, సెప్టెంబరు 22 (ఆంధ్రజ్యోతి): డోన్‌ పట్టణ సమగ్ర అభివృద్ధిలో భాగంగా రహదారుల అభివృద్దికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. హైబ్రిడ్‌ యాన్యుటీ మోడల్‌ (హెచ్‌ఏఎం) విధానంలో రూ.21 కోట్ల అంచనా వ్యయంతో 13.18 కి.మీ.ల రహదారులు, బేతంచెర్ల నగర పంచాయతీ పరిధిలో రూ.17 కోట్ల వ్యయంతో పనులు చేయనున్నారు. మంగళవారం సీఎం చంద్రబాబు వర్చువల్‌ విధానంలో అమరావతి నుంచి ప్రారంభించారు. డోన్‌లో ఎమ్మెల్యే కోట్ల పాల్గొన్నారు. పెండింగ్‌లో పనులను ప్రభుత్వం దశలవారీగా పూర్తిచేస్తుందని డోన్‌ నియోజపకవర్గం, పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన చర్యల చేపడుతామన్నారు. నాయకులు వలసల రామకృష్ణ, సీంధ్ర శ్రీనివాసులు, టీఈ రాఘవేంద్రగౌడు, తదితరులు పాల్గొన్నారు.

ఆళ్లగడ్డకు రూ.21కోట్లు మంజూరు

ఆళ్లగడ్డ: పురపాలక సంఘానికి రూ.21 కోట్ల నిధులు మంజూరయ్యాయి. పట్టణ మౌలిక సదుపాలయల అభివృద్ధికి మంగళవారం సీఎం చంద్రబాబు కుప్పం నుంచి హైబ్రిడ్‌ యాన్యుటి మోడల్‌ను వర్చువల్‌గా ప్రారంభించారు. పట్టణంఓలని పురపాలక సంఘం ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కమిషనర్‌ కిషోర్‌బాబు, మేనేజర్‌ ఆనంద్‌, శానిటరీ అధికారి బాలస్వామి, టీడీపీ కౌన్సిలర్‌ హుసెన్‌బాషా టీడీపీ నాయకులు చెంతకుంట రామశేఖర్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, సోముల శేఖర్‌రెడ్డి, రామాచారి, చరణ్‌ పాల్గొన్నారు.

పట్టణ రూపురేఖలు మారనున్నాయి: ఎమ్మెల్యే

పట్టణానికి ప్రభుత్వం రూ.21కోట్లు మంజూరు చేయడంతో పట్టణ రూపురేఖలు మారుతాయని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఓ ప్రకటనలో ఆనందం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబుకు ఆళ్లగడ్డ ప్రజల తపున కృత జ్ఞతలు తెలిపారు. రహదారులు, ఆహ్లాద కరమైన పార్కు, మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు.

Updated Date - Sep 23 , 2026 | 12:01 AM