Share News

బెలుం గుహలకు సందర్శకుల తాకిడి..

ABN , Publish Date - Jul 26 , 2026 | 11:46 PM

ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పర్యాటక కేంద్రం బెలుం గుహలకు ఆదివారం సందర్శకుల తాకిడి పెరిగింది. మూడు నెలలుగా వేసవి కారణంగా పర్యాటకులు అసలు రాలేదు. అయితే సెలవు దినం కావడంతో వివిధ ప్రాంతాలకు చెందిన పర్యాటకులు పెద్ద ఎత్తున రావడంతో గుహలు కళకళలాడాయి.

బెలుం గుహలకు సందర్శకుల తాకిడి..
గుహల అందాలను వీక్షిస్తున్న పర్యాటకులు

ఆదివారం వెయ్యి మంది, రూ.70వేల ఆదాయం

కొలిమిగుండ్ల, జూలై 26 (ఆంధ్రజ్యోతి): ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పర్యాటక కేంద్రం బెలుం గుహలకు ఆదివారం సందర్శకుల తాకిడి పెరిగింది. మూడు నెలలుగా వేసవి కారణంగా పర్యాటకులు అసలు రాలేదు. అయితే సెలవు దినం కావడంతో వివిధ ప్రాంతాలకు చెందిన పర్యాటకులు పెద్ద ఎత్తున రావడంతో గుహలు కళకళలాడాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు, కర్ణాటక, తమిళనాడు ప్రాంతాలకు చెందిన పర్యాటకులు, మరోవైపు అడ్మీన్‌ అడిషనల్‌ ఏస్పీ ఖాదర్‌భాషా కుటుంబ సభ్యులతో కలిసి వచ్చారు. ఒకే రోజు వెయ్యి మంది రావడంతో రూ. 70వేలు లభించినట్లు గుహల సిబ్బంది వెల్లడించారు.

Updated Date - Jul 26 , 2026 | 11:46 PM